Diabetes: డయాబెటీస్ ఉందా? ఎలాంటి ఫ్రూట్స్ తినాలంటే

షుగర్ ఉంటే పండ్లు తినాలంటే కూడా ఆలోచిస్తారు. దీని వల్ల సమస్య మరింత పెరుగుతుంది కావచ్చని భయపడతారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు పండ్లు తినవచ్చని తెలుపుతుంది అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్.

Written By: Swathi Chilukuri, Updated On : June 7, 2024 3:32 pm

Diabetes

Follow us on

Diabetes: ఈ మధ్య చాలా మందికి వయసుతో పాటు వ్యాధులు పెరుగుతున్నాయి. ఆరోగ్యమైన డైట్ ఫాలో అయినా సరే కొందరిని కొన్ని వ్యాధులు వెంటాడుతూనే ఉంటున్నాయి. ఇక సాధారణంగా ఎక్కువ మందిలో షుగర్, బీపీ వంటివి ఎక్కువ వస్తాయి. మరి డయాబెటీస్ ఉంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి. ఎలాంటి ఫుడ్ తీసుకోవద్దు అనే టెన్షన్ ఉంటుంది. అయితే ఎలాంటి టెన్షన్ లేకుండా కొన్ని పండ్లను తినవచ్చట డయాబెటీస్ పేషెంట్లు ఇంతకీ అవేంటో కూడా చూసేయండి.

షుగర్ ఉంటే పండ్లు తినాలంటే కూడా ఆలోచిస్తారు. దీని వల్ల సమస్య మరింత పెరుగుతుంది కావచ్చని భయపడతారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు పండ్లు తినవచ్చని తెలుపుతుంది అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్. అంతేకాదు వీరు ఫ్రెష్ ఫ్రూట్ సలాడ్ శరీర పోషణను పెంచడానికి ఒక గొప్ప మార్గమని తెలిపారు.. మీరు క్యాన్డ్ ఫ్రూట్‌ని తీసుకోవాలి అనుకుంటే ముందుగా ‘షుగర్‌ఫ్రీ’ లేదా ‘నో యాడ్ షుగర్’ అని పెట్టె మీద రాసి ఉందో లేదో చెక్ చేసి కొనుగోలు చేయండి.

ఒక చిన్న పండు లేదా అరకప్పు క్యాన్డ్ ఫ్రూట్‌లో అయినా మీకు ఏకంగా 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. ఇక ఎండుద్రాక్ష లేదా ఎండిన చెర్రీస్ లలో కూడా చాలా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అంతేకాదు రెండు టేబుల్ స్పూన్ల ఎండిన పండ్లలో కూడా ఏకంగా 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. అందుకే తినేటప్పుడు కాస్తు గుర్తుపెట్టుకొని తినాలి అంటారు నిపుణులు.

భోజనం చేసిన తర్వాత ఒక పండును లేదా కాస్త జ్యూస్ ను తాగడం మంచిది. డయాబెటిస్‌లో మీరు ఏ పండ్లు తినవచ్చు అనే ప్రశ్న కూడా మీలో ఉండే ఉంటుంది. అయితే మీకు డయాబెటీస్ ఉంటే ఆపిల్, అరటిపండ్లు, చెర్రీస్, ద్రాక్ష, పుచ్చకాయలు, కివీస్, మామిడి, నారింజ, బొప్పాయి, బేరి, పైనాపిల్స్ స్ట్రాబెర్రీ వంటి ఫ్రూట్ లను ఎలాంటి సందేహం లేకుండా తినవచ్చు.