మన దేశంలో కొంతమంది వాస్తు శాస్త్రాన్ని బాగా నమ్మితే మరి కొందరు మాత్రం వాస్తును నమ్మడానికి అస్సలు ఇష్టపడరు. అయితే గృహ నిర్మాణం చేసే సమయంలో వాస్తు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకునే వాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇంటి నిర్మాణం సమయంలో చేసే తప్పుల వల్ల ఇంటిలోని కుటుంబ సభ్యులపై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

వాస్తుశాస్త్రంను అనుసరించి ఇంటికి మెట్లను నిర్మించుకోవాలో అవగాహన కలిగి ఉండాలి. అలా నిర్మించుకోని పక్షంలో మాత్రం ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. నైరుతి దిశలో మెట్లు నిర్మించుకుంటే మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మధ్య దక్షిణం, పడమర దిశ కూడా మెట్ల నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. చాలామంది మెట్ల కింద ఏదో ఒక నిర్మాణాన్ని చేపడుతూ ఉంటారు.
అయితే వాస్తు ప్రకారం మెట్ల కింద ఎటువంటి నిర్మాణం ఉండకూడదు. మెట్ల కింద ఏదైనా గది ఉంటే ఇంటి అధిపతికి సమస్యలు వస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో మెట్ల నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత వేగంగా పూర్తి చేయల్సి ఉంటుంది. అలా కాకుండా అసంపూర్తిగా ఉంచడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సగం పూర్తైన మెట్లు ఉంటే ఇతర సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది.
వాస్తు ప్రకారం ఇంటికి సంబంధించిన మెట్లు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి. అలా ఉండని పక్షంలో ఆర్థికపరమైన సమస్యలు వస్తాయి. మెట్లపై ఎల్లప్పుడూ తగినంత లైటింగ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎటువంటి సమస్యలు రావు. వాస్తు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుని మెట్ల నిర్మాణం చేపడితే మంచిదని చెప్పవచ్చు.