Kidney Stones: ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే మీకు కిడ్నీలో రాళ్లు వచ్చాయి..

చాలా మంది మాకు కూడా స్టోన్స్ ఉన్నాయి కావచ్చు అనే భయంతో ఉంటారు. ఇంతకీ మీ శరీరంలో స్టోన్స్ ఉన్నాయా? ఉంటే ఎలా కరిగించుకోవాలి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written By: Swathi Chilukuri, Updated On : April 5, 2024 12:21 pm

kidney stones symptoms

Follow us on

Kidney Stones: ఎప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చి పడుతున్నాయో చెప్పడం కష్టమే. ఈ బిజీ లైఫ్ లో శరీరం గురించి పట్టించుకునేవారు తక్కువ. అయితే ఇప్పుడు చాలా మందిలో కిడ్నీలో రాళ్లు అనే సమస్య ఎక్కువగా వస్తుంది. ఈ కిడ్నీల్లో రాళ్లు రావడం అనే సమస్య చాలా సర్వసాధారణంగా జరుగుతుంది. నీరు తాగకపోవడం, వంశ పారంపర్యంగా ఈ సమస్య ఇతరులకు రావడం వంటివి జరుగుతున్నాయి. అయితే చాలా మంది మాకు కూడా స్టోన్స్ ఉన్నాయి కావచ్చు అనే భయంతో ఉంటారు. ఇంతకీ మీ శరీరంలో స్టోన్స్ ఉన్నాయా? ఉంటే ఎలా కరిగించుకోవాలి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మన దేహంలో ఉన్న రాళ్లను ఎలా గుర్తించాలి. ఉంటే ఎలా కరిగించుకోవాలి అనే వివరాలు కనిపెడితే కాస్త ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు. అయితే మన శరీరంలో రాళ్లు ఉంటే ఉన్నట్టుండి నడుము నొప్పి రావడం, సడన్ గా నొప్పి తెలియడం వంటివి జరుగుతుంటాయట. కొందరికి వాంతులు కూడా అవుతాయి. మరికొందరిలో టాయిలెట్ కు వెళ్లినప్పుడు ఏకంగా రక్తం కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే డాక్టర్ ను సంప్రదించాలి.

చిన్న టెస్ట్ ద్వారా ఈ రాయి ఎక్కడ ఉంది అనే వివరాలను తెలుసుకోవచ్చు. దీనివల్ల మందులను వాడుతూ ఆ రాయిని తగ్గించవచ్చు. అయితే ఈ రాయి పరిమాణం ఎక్కువగా ఉంటేనే లేదంటే కొన్ని పరిస్థితుల్లో మాత్రమే ఆపరేషన్ చేస్తుంటారు. సమస్య చిన్నగా మెడిసిన్ ద్వారానే కరిగిపోయేలా ముందులు ఇస్తారు వైద్యులు. ఇక రాళ్ల సమస్య రాకుండా ముందే జాగ్రత్త పడాలి అంటే నీటిని ఎక్కువగా తీసుకోవాలి. నీరే ఈ రాళ్లకు దివ్యౌషధంగా పనిచేస్తాయి. కాబట్టి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందని మర్చిపోకండి.