Kia Seltos Facelift: దక్షిణ కొరియాకు చెందిన కియా కార్లు భారత మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి చాలా మోడళ్లు బయటకు వచ్చి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. కియా నుంచి సెల్టోస్ రిలీజ్ అవుతుందని ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా లీకులు వచ్చాయి. ఇప్పుడీ మోడల్ ను జూలై 14 నుంచి బుకింగ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. సెల్టోస్ లో ఇంటీరియర్, ఎక్స్ టీరియర్ లో చాలా మార్పులు చేసి కొత్త ఫీచర్లను జోడించారు. అయితే కియా కారును ఎంతకు విక్రయించాలో ఇప్పుడైతే నిర్ణయించలేదు. కానీ దీని మోడల్, ఫీచర్లు తెగ ఆకట్టుకుంటున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..
కియా సెల్టోస్ మొత్తం మూడు వేరియంట్లలో మార్కెట్లోకి రానుంది. వీటిలో ఎక్స్ లైన్, జీటీ లైన్, టెక్ లైన్ ఉన్నాయి. ఎల్ ఈడీ డీఆర్ ఎల్స్, ఎల్ ఈడీ హెడ్ ల్యాంప్, ఎల్ ఈడీ టర్న్ ఇండికేటర్స్ ఈ మోడల్ లో అలరిస్తున్నాయి. మ్యాటీ గ్రాఫైట్ ఫినిష్ కలర్ ఆప్షన్స్ తో కలిపి మొత్తం 8 రంగుల్లో కియా సెల్టోస్ మార్కెట్లోకి రానుంది. 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్, పూర్తి డిజిటల్ టీఎఫ్ టీ ఇనస్ట్రిమెంట్ క్లసర్ ఇందులో ఉన్నాయి. డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ ఏసీ ఆకట్టుకుంటున్నాయి.
కియా సెల్టోస్ ఫీచర్ల విషయానికొస్తే.. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ టర్బో ఇంజిన్ తో పాటు 1.5 లీటర్ డీజిల్ కూడా అందుబాటులో ఉంది. ఆటో క్రూయిజ్ కంట్రోల్ తో పాటు 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, ట్రాక్షన్, కంట్రోల్ హిల్ అసిస్టెంట్ వంటి సేఫ్టీ ఫీచర్లు అలరిస్తున్నాయి. వాయిస్ కంట్రోల్ తో పనిచేసే పనోరమిక్ సన్ రూఫ్ తో పాటు 8 స్పీకర్ల బాష్ ఆడియోను ఇందులో అమర్చారు. ఇక దీని బుకింగ్స్ జూలై 14 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ధరను మాత్రం వెల్లడించలేదు. ఈనేపథ్యంలో కొందరు మోడల్ ఆకట్టుకునే విధంగా ఉండడంతో బుకింగ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.
మినీ ఎస్ యూవీగా సెల్టోస్ ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి ఆకర్షించింది. అయితే దీనినే రీ డిజైన్ చేసి పలు కీలక ఫీచర్లను అప్డేట్ చేశారు. లోపలి భాగాన్ని కంప్లీట్ చేంజ్ చేసి.. ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా కియా ఎండీ, సీఈవో థై-జిన్ పార్క్ మాట్లాడుతూ దేశీయ 10 శాతం మార్కెట్ వాటాను లక్ష్యంగా దేశీయ మార్కెట్లో నిర్ణయించామన్నారు. అందుకు తగిన విధంగా ప్రణాళికను వేసినట్లు పేర్కొన్నారు.