Zodiac sign: వేద శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలు రాశులకు మేలు చేయడంతో పాటు చల్లని చూపును అందిస్తాయి. మరికొన్ని గ్రహాలు మాత్రం అందుకు వ్యతిరేకంగా ఉంటాయి. వీటిలో రాహువు, కేతువు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అయితే శని తర్వాత తర్వాత కేతువు అత్యంత నెమ్మదిగా ప్రయాణిస్తూ ఉంటాడు. ఈ గ్రహం ఒకే రాశిలో 18 నెలల పాటు కొనసాగుతూ ఉంటుంది. 2024 ఏడాది అక్టోబర్ చివరి వారంలో కేతువు కన్యా రాశిలోకి ప్రవేశించాడు. 2025 మే 5న కన్య రాశి నుంచి సింహరాశిలోకి కేతువు ప్రయాణాన్ని మొదలుపెడతాడు. కేతువు తన స్థానాన్ని మార్చుకోవడం వల్ల సింహరాశి పై మాత్రమే కాకుండా ఇతర కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. ఈ క్రమంలో కొన్ని రాశుల వారికి అనుకూలంగా మారే అవకాశం ఉంది. అలాంటి రాశులు ఏమో ఇప్పుడు తెలుసుకుందాం.
కేతువు స్థానం మార్చుకోవడం వల్ల మిథున రాశిపై ప్రభావం పడుతుంది. మిగతా రాశుల కంటే ఈ రాశి వారికి అత్యంత అదృష్టం కలగాలని ఉంది. వీరి జీవితంలో ఇప్పటివరకు చూడని మార్పులు చూస్తారు. ఆధ్యాత్మికంపై నమ్మకం పెరుగుతుంది. దీంతో ఎక్కువగా పూజలు వ్రతాల్లో పాల్గొంటారు. ఎప్పటినుంచో అనుకుంటున్నా కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. ఒక్క విశ్వాసంతో ముందుకు వెళ్లడంతో ధైర్యంగా ఉండగలుగుతారు. ఇలాంటి కష్టాన్ని వచ్చిన ఎదుర్కొనగలుగుతారు. మిగతా రాశుల కంటే మిథున రాశి వారిపై కేతువు ప్రభావం తక్కువగా ఉంటుంది. పరిచయాలు పెరగడంతో సమాజంలో గౌరవం పెరుగుతుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. కుటుంబంతో కలిసి వ్యాపారం చేసే వారికి లాభాలు ఎక్కువగా ఉంటాయి.
తులారాశి వారిపై కేతువు 11వ ఇంట్లో సంచరించబోతున్నాడు. దీంతో వీరికి అనుకూల పవనాలు ఉండనున్నాయి. ఈ రాశి వారు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పట్టిందల్లా బంగారమే అవుతుంది. అనుకోని అదృష్టం వలన ధనం పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులను చేపడుతారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కొన్ని కారణాలవల్ల కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వీరితో లాభాలే ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. కొత్తగా పెట్టుబడును పెట్టాల్సి వస్తే పెద్దలు సలహా తీసుకోవడం మంచిది.
కేతువు స్థానం మార్చుకోవడం వల్ల మీన రాశిపై ప్రభావం పడనుంది. ఈ రాశి వారికి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపారులకు ధన లాభం ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు ప్రయాణాలు చేస్తారు. ఇవి వీరికి లాభం చేకూరుస్తాయి. కుటుంబంతో సంతోషంగా ఉండడంతో మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామికి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్తగా ఏ పని మొదలుపెట్టిన వెంటనే పూర్తి చేస్తారు. ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. అయితే దూర ప్రయాణాలు చేసే సమయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి.