Leaf And Clove: డబ్బు అందరికీ అందుబాటులో ఉండదు. దీంతో ఇది తక్కువగా ఉన్నవారు మరొకరి దగ్గర అప్పుగా తీసుకుంటారు. ఒకప్పుడు డబ్బులు అప్పుగా తీసుకొని కొన్ని రోజుల తర్వాత తిరిగి ఇచ్చేవారు. ఆ తర్వాత వడ్డీ వ్యాపారంలో వడ్డీని వసూలు చేస్తూ రుణాలు అందించారు. ప్రస్తుతం బ్యాంకు ద్వారా అప్పులు తీసుకుంటూ తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. అయితే కొందరు అప్పు తీసుకునే సమయంలో బాగానే ఉంటున్నారు. కానీ దీనిని తీర్చడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. ఎందుకంటే సంవత్సరాలు నడుస్తున్నా.. కొందరికి అప్పులు తీరడం లేదు. అయితే ఒక చిన్న పరిహారం చేయడం వల్ల ఎంత పెద్ద రుణం అయినా తొందరగా తీరే అవకాశం ఎక్కువగా ఉందని కొందరు పండితులు చెబుతున్నారు. అందుకోసం ఏం చేయాలంటే?
అప్పు కొందరికి అవసరాలను తీరుస్తుంది.. కానీ మరికొందరికి భారంగా మారుతుంది. చేసిన అప్పు తీరకపోవడం వల్ల చాలామంది ప్రాణాలు తీసుకున్న వారు ఉన్నారు. మరికొందరు మాత్రం ఇలా తీసుకున్న అప్పు అలా వెంటనే తీర్చే సి హ్యాపీగా ఉన్నారు. అయితే అప్పు తీరకపోవడంలో కొన్ని జాతక సమస్యలు కూడా ఉంటాయని అంటున్నారు. అంతేకాకుండా అప్పు తీసుకునే సమయంలో కొన్ని చేసిన పొరపాట్ల వలన ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారని చెబుతున్నారు.
సాధారణంగా ఎవరు అప్పు ఇచ్చినా మంగళవారం లేదా శనివారం అస్సలు తీసుకోవద్దని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. ఈ రెండు రోజుల్లో ఎలాంటి అప్పు తీసుకున్న అవి పూర్తి చేయడానికి సంవత్సరాలు పడుతుంది. సోమ, బుధ, శుక్రవారం లో అప్పు తీసుకుంటే తొందరగా తీరుతుంది. అయితే చేసిన ప్రతి పొరపాటుకు ఒక పరిష్కార మార్గం ఉంటుంది. అలాగే కొందరు తెలియక ఆయా రోజుల్లో తీసుకున్న అప్పుడు తీరకపోవడం వల్ల కొన్ని పరిహారాలు చేయవచ్చు. ఈ పరిహారాలకు ఎలాంటి పెద్ద ఖర్చు కూడా ఉండదు.
మార్కెట్లో దొరికే తమలపాకుల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. వీటిని చాలామంది పాన్ తినేందుకు ఉపయోగిస్తారు. తమలపాకులతో ఎక్కువగా ఆంజనేయస్వామికి పూజ చేస్తారు. స్కంద పురాణం ప్రకారం సముద్ర మదనంలో తమలాపాకును మొదటిసారిగా ఉపయోగించారు. అప్పటినుంచి ప్రతి శుభ కార్యాలయాల్లో తమలపాకును ఉపయోగిస్తారు. స్వచ్ఛమైన ఆకుగా పేర్కొనబడే తమలపాకు తో అప్పులు కూడా తీర్చుకోవచ్చని కొందరు చెబుతున్నారు.
విపరీతంగా అప్పులతో బాధపడేవారు ఒక తమలపాకును తీసుకోవాలి. ఇది స్వచ్ఛంగా అంటే పచ్చగా ఉండాలి. దీని కాండాన్ని తొలగించాలి. దానిపై రెండు లవంగాలు అలాగే యాలకులను కూడా ఉంచాలి. ఇది బుధ గ్రహంతో సంబంధం ఉంటుంది. బుధుడు ఆర్థిక సమస్యల నుంచి బయటపడేస్తారని చెబుతారు. అందువల్ల తమలపాకు పై రెండు లవంగాలు ఉంచి అలాగే ఏలకులను కూడా ఉంచి పాన్ లాగా మనిషి కట్టండి. దీనిని మంగళవారం సాయంత్రం సమీప ఆంజనేయస్వామి ఆలయంలోకి వెళ్లి స్వామివారికి సమర్పించాలి. ఇలా మూడు నెలలపాటు చేయడం వల్ల అప్పుల బాధ నుంచి విముక్తి పొందవచ్చని పండితులు చెబుతున్నారు. అయితే దీనిని స్వామివారికి సమర్పించే సమయంలో సూచి శుభ్రతతో ఉండాలి.