Kane Williamson Out Controversy: క్రికెట్ లో చాలా వరకు వివాదలు తలెత్తుతుంటాయి. కొన్ని సార్లు అంపైర్లు ఇచ్చే తప్పుడు నిర్ణయాలు మ్యాచ్ ఫలితలనే మార్చేస్తుంటాయి. తద్వారా గెలవాల్సిన టీమ్ ఓడిపోతుంది.. ఓడిపోయే టీమ్ గెలుస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో మొన్న సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో జరిగిన చిన్న ఘటన.. ఇప్పుడు పెను దుమారమే రేపుతోంది.

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 210 పరుగులు చేయగా.. సన్‌రైజర్స్ ఏడు వికెట్లను కోల్పోయి కేవలం 149 రన్స్ మాత్రమే చేసి దారుణంగా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ కెప్టెన్ విలియమ్స్ ఔట్ అయిన తీరు వివాదాస్పదం అయింది. ఆయన ఉంటే తాము మ్యాచ్ గెలిచే వాళ్లమని సన్ రైజర్స్ భావించింది. కానీ వివాదస్పద రీతిలో ఆయన ఔట్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
Also Read: Tata IPL 2022: బోణీ కోసం ముంబై.. ఆధిపత్యం కోసం రాజస్థాన్.. బలబలాలు ఇవే..!
ఛేజింగ్ లో భాగంగా బ్యాటింగ్ కు దిగిన రైజర్స్ తరఫున కేన్ కేన్ విలియమ్సన్ గ్రౌండ్ లో ఆడుతున్నాడు. కాగా ఆయన వివాదస్పదంగా ఔట్ కావడంతో.. ఈ విషయాన్ని హైదరాబాద్ మేనేజ్‌మెంట్ సీరియస్ గా తీసుకుంది. దీనిమీద బీసీసీఐకి అలాగే ఐపీఎల్ గవర్నింగ్ బాడీ వద్దకు తీసుకెళ్లింది. ఈ మేరకు బీసీసీఐకు ఓ లేక కూడా రాసింది. అందులో తన నిరసనను తెలిపింది.
వాస్తవంగా చూసుకుంటే.. బ్యాటింగ్ ఆడుతున్న విలియమ్సన్.. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో ఆడుతున్నాడు. అప్పటికే ఆరు బంతుల్లో రెండు రన్స్ చేసి.. అప్పుడప్పుడు గ్రౌండ్ లో కుదురుకుంటున్నాడు విలియమ్సన్. కానీ ప్రసిద్ధ్ కృష్ణ వేసిన హైపిచ్ బాల్ ను డిఫెండ్ ఆడాడు విలియమ్సన్. ఇంకేముంది ఆ బాల్ కుడివైపు స్లిప్స్‌లో గాల్లోకి లేచింది. దీంతో కీపర్ సంజు దాన్ని అందుకునేందుకు డైవ్ చేశాడు. కానీ అతని గ్లోవ్స్‌లో పడి మళ్లీ గాల్లోకి లేచింది ఆ బాల్.

ఆ వైపున స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న దేవ్‌దత్ పడిక్కల్ దాన్ని అందుకునేందుకు ముందుకు డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. కానీ అతని చేతుల్లో పడేముందే ఆ బాల్ పిచ్‌ను తాకింది. గ్రౌండ్‌ను తాకిన తర్వాత అతని చేతుల్లో పడింది. ఇదంతా రీప్లేలో క్లియర్ గా కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం అవుట్ ఇచ్చేశాడు. ఇదే పెను దుమారం రేపుతోంది. దీని మీదనే సన్‌రైజర్స్ మేనేజ్ మెంట్ రంగంలోకి దిగింది. ఏకంగా బీసీసీఐకి లేఖ రాయడం ఇప్పుడు సంచలనంగా మారిపోయింది. మరి దీని మీద బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Also Read:India- America: అమెరికా బెదిరింపులను భారత్ లెక్కచేయడం లేదా?
[…] Most Wanted Thief Arrested: అతడిదో ప్రత్యేక శైలి. దొంగతనాలు చేయడంలో అందెవేసిన చేయి. అతడు కల గన్నాడో ఇక అంతే సంగతి. ఆ ఇల్లు గుల్ల కావాల్సిందే. అతడికి వచ్చే కలలు అలా ఉంటాయి. రాత్రి కల వస్తే ఇల్లు కొల్లగొట్టాల్సిందే. ఇప్పటికి పలు దొంగతనాలు చేసినా జైలుకు వెళ్లినా అతడి వృత్తి మాత్రం మానలేదు. నిరంతరం అదే ధ్యాసలో ఉంటాడు. చోరకళనే నమ్ముకుని జీవిస్తున్నాడు. చివరకు పోలీసులకు చిక్కడంతో అతడి వివరాలు పోలీసులు వెల్లడించారు. […]
[…] Vijayendra Prasad About RRR Sequel: ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీసును బద్దలు కొడుతున్న ఆర్ఆర్ఆర్.. ఇప్పటికే ఏడు వందల కోట్ల క్లబ్ లో చేరి పోయింది. మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడానికి శరవేగంగా దూసుకుపోతోంది. మొదటి వారమే ఈ రేంజ్ లో కలెక్షన్లు రాబట్టింది అంటే.. రెండో వారం ఏ కొంచెం తగ్గినా.. అది సినిమాకు పెద్దగా మైనస్ అవ్వదు. జక్కన చెక్కిన ఈ మాయాజాలం.. ఈ భాష భాష అనే తేడా లేకుండా సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. […]