Reduce 1300 Calories: నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఒత్తిడితో కలిగి ఉంటున్నారు. ఉద్యోగం, వ్యాపారం కారణంగా నిత్యం బిజీ లైఫ్ తో ఉండడంతో ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదు. నీతో చిన్న వయసులోనే అనేక అనారోగ్యాలకు గురవుతూ ఆసుపత్రుల పాలవుతున్నారు. అయితే కొంతమంది మార్నింగ్ వాక్ లేదా సాధారణ వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొన్ని రకాల వ్యాయామం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా దృఢంగా తయారవుతారు. వాటిలో స్కిప్పింగ్ ఒకటి. స్కిప్పింగ్ గురించి చాలామందికి అందరికీ తెలిసే ఉంటుంది. కానీ దీనిని అవాయిడ్ చేస్తారు. అయితే స్కిప్పింగ్ చేయడం వల్ల ఎన్ని రకాల లాభాలు ఉన్నాయో తెలుసుకుంటే కచ్చితంగా ప్రతిరోజు స్కిప్పింగ్ చేస్తారు. మరి అలాగా ఏంటో తెలుసుకుందాం..
ఈ రోజుల్లో ఇంట్లో ఆహారం కంటే బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినేవారు ఉన్నారు. అలాగే టెస్ట్ కోసం కొత్త కొత్త ఆహార పదార్థాలను తినడంతో అధిక బరువు పెరుగుతున్నారు. మిగతా అనారోగ్యాల కంటే బరువు సమస్య చాలా పెద్దది అనుకోవచ్చు. ఎందుకంటే బరువు కారణంగా ఏ పని సక్రమంగా చేయలేరు. అలాగే ఇతర అనారోగ్యాలకు బరువు కూడా కారణంగా ఉంటుంది. అయితే బరువు తగ్గడానికి ప్రతిరోజు స్కిప్పింగ్ చేయడం చాలా అవసరం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు పది నిమిషాలపాటు స్కిప్పింగ్ చేయడం వల్ల 1300 క్యాలరీలు ఖర్చు అవుతాయి. దీంతో కొన్ని రోజుల్లోనే బరువు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ఒక మైలు పరిగెత్తే దానికంటే పది నిమిషాలు స్కిప్పింగ్ చేయడం ఎంతో మేలు అని అంటున్నారు.
స్కిప్పింగ్ చేయడం వల్ల ఎక్కువగా కాళ్లపై దృష్టి పెడుతూ ఉంటావు. అలాగే ఎటువంటి ఆలోచన ఈ సమయంలో రాదు. దీంతో బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. ఫలితంగా నెగిటివ్ ఆలోచనలు కూడా రాకుండా ఉంటాయి. అంటే స్కిప్పింగ్ చేయడం వల్ల మెదడు పనితీరు కూడా మెరుగ్గా మారుతుంది. ముఖ్యంగా మహిళలు స్కిప్పింగ్ చేసే సమయంలో వారి మనసును అదుపులో ఉండి ఆలోచనలు సక్రమంగా చేస్తుంది.
అధిక పరువు కారణంగా ముందుగా గుండెపై ప్రభావం పడుతుంది. అయితే స్కిప్పింగ్ చేయడం వల్ల హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటుంది. దీంతో గుండె సమస్యల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. నిత్యం హార్ట్ బీట్ పెరగడం వల్ల గుండెకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే స్కిప్పింగ్ చేయడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల గుండెకు సరఫరా అయ్యే రక్తం కూడా మెరుగ్గా మారుతుంది. దీంతో ఈ సంవత్సరం వచ్చి బయటపడవచ్చు.
స్కిప్పింగ్ చేసే సమయంలో శ్వాస ఎక్కువగా పిలుస్తూ ఉంటాము. దీంతో ఊపిరితిత్తులు కూడా ఆరోగ్యంగా మారుతాయి. స్కిప్పింగ్ చేయడం వల్ల ఎక్కువ సేపు గాలిని పీల్చుకునే అవసరం ఉంటుంది. చెప్పింది చేయడం వల్ల భుజాల భాగం ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో కండరాలు సక్రమంగా పనిచేసే రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు స్కిప్పింగ్ చేయడం అలవాటు చేసుకోండి.