Judge and suspect classmates: చిన్నప్పుడు ఎవరైనా కలిసి చదువుకుంటే.. పెద్దయ్యాక ఒకరు ఐఏఎస్ ఆఫీసర్ లేదా ఒకరు ఐపీఎస్ ఆఫీసర్ అవుతారు. లేదా ఒకరు తక్కువ ఆదాయాన్ని.. మరొకరు ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. కానీ అనుకోని పరిస్థితి వల్ల ఇద్దరు స్నేహితుల్లో ఒకరు దొంగలాగా.. మరొకరు ఆ దొంగను విచారించే జడ్జి లాగా కనిపించారు. ఇది తెలుసుకున్న ఇద్దరు ఎంతో బాధపడ్డారు. అయితే ఆ తర్వాత ఏం జరిగింది? అసలు దొంగ ఎవరు? జడ్జి ఎవరు? ఇంట్రెస్టింగ్ స్టోరీ మీకోసం..
వాళ్ళిద్దరూ కలిసి చదువుకున్నారు.. ఆటలు ఆడుకున్నారు.. కొన్నాళ్ల తర్వాత ఎవరికి వారు విడిపోయారు. వారిలో ఒకరు ఆల్టర్ బూట్.. మరొకరు గ్లేజర్. వీరిలో కొన్నాళ్ల తర్వాత ఆల్టర్ బూట్ ఒక నేరం చేసి జైలు శిక్ష అనుభవిస్తాడు. అయితే తన కుటుంబ సభ్యులు బెయిల్ కోసం అప్లై చేయగా విచారణ కోసం కోర్టుకు వస్తాడు. ఈయన కోర్టుకు వచ్చిన సందర్భంగా విచారించే జడ్జిని చూస్తాడు. కానీ విచారించే జడ్జి ఎవరో కాదు. గ్లేజర్. అంటే బూట్ తో కలిసి చదువుకున్న స్నేహితురాలు. ఆల్టర్ బూట్ ను చూసి తన చిన్ననాటి స్కూల్ పేరు చెప్పి అందులో నీవు చదువుకున్నావు కదా.. అని గ్లేజర్ అంటుంది. అలా స్కూల్ పేరు చెప్పగానే ఆల్టర్ బూట్ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటాడు. తనతో చదివిన తన క్లాస్మేట్ జడ్జిగా మారినందుకు ఎంతో గర్వపడుతూనే.. మరోవైపు తన జీవితం ఇలా మారినందుకు ఎంతో బాధపడతాడు. అయితే విచారణ సందర్భంగా గ్లేజర్ మాట్లాడుతూ.. ఆల్టర్ బూట్ చిన్నప్పుడు ఎంతో తెలివిగలవాడు.. అనుకోకుండానే తన జీవితం ఇలా మారి ఉంటుంది అని చెబుతోంది. అలా కొన్నాళ్ల తర్వాత ఆల్టర్ బూట్ జైలు నుంచి రిలీజ్ అవుతాడు. రిలీజ్ అయిన తర్వాత మరోసారి పాత స్నేహితులు కలుసుకుంటారు. ఈ సందర్భంగా గ్లేజర్ మాట్లాడుతూ.. ఇప్పటినుంచి అయినా కుటుంబాన్ని బాగా చూసుకోవాలని చెబుతోంది. అప్పుడు ఆల్టర్ బూట్ మాట్లాడుతూ.. తనకు, తన కుటుంబానికి నీవే ఇన్స్పైర్ అని అంటాడు.
ఇలా ఇద్దరు ఒకే ప్రయాణం చేసిన వ్యక్తులు తమ పరిస్థితుల వల్ల ఒకరు ఉన్నత స్థాయిలో.. మరొకరు కింది స్థాయిలో ఉండగలుగుతారు. అయితే జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ఒక్కోసారి సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. ఇలా చిక్కుల్లో నుంచి బయటపడిన తర్వాత మన జీవితాన్ని మనమే సరైన మార్గంలో నడిపించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ఒక్క వ్యక్తికి మరొకరు ఇన్స్పైర్ గా ఉంటారు. ఇక్కడ ఆల్టర్ బూట్ కు తన చిన్ననాటి స్నేహితురాలు గ్లేజర్ ఇన్స్పైర్ గా నిలిచారు. ప్రతి ఒక్కరూ ఇతరులకు ఇన్స్పైర్ గా మారడానికి ప్రయత్నించి.. ఇతరుల జీవితాలకు కూడా ఆదర్శంగా నిలవాలి..