Mirai First Day Collections: వరుస ఫ్లాప్స్ తో డీలాపడిన టాలీవుడ్ ని సెప్టెంబర్ నెలలో విడుదల అవుతున్న సినిమాలు ఒక దానిని మించి ఒకటి సూపర్ హిట్ అవుతూ బాక్స్ ఆఫీస్ ని మరోసారి కళకళలాడేలా చేస్తున్నాయి. నిన్న విడుదలైన ‘మిరాయ్'(Mirai Movie) చిత్రం మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని కైవసం చేసుకుంది. ఆ టాక్ ప్రభావం కలెక్షన్స్ పై చాలా బలంగా చూపించింది. మార్నింగ్ షోస్ నుండి సెకండ్ షోస్ వరకు నిన్న ఈ సినిమాకు నమోదైన ఆక్యుపెన్సీలు చూసి ట్రేడ్ కి మతి పోయింది. టికెట్ హైక్స్ లేకుండా ఒక సాధారణ హీరో కి ఇంతటి కలెక్షన్స్ వస్తాయా అని అందరూ ఆశ్చర్యపోయారు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 26 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ మేకర్స్ మాత్రం 27.5 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు కాసేపటి క్రితమే ఒక పోస్టర్ ని విడుదల చేశారు. ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.
రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రానికి దాదాపుగా 14 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. తేజ సజ్జ గత చిత్రం ‘హనుమాన్’ కంటే దీనికే ఎక్కువ ఓపెనింగ్ అని చెప్పొచ్చు. షేర్ వసూళ్లు 7 కోట్ల రూపాయిల వరకు ఉండొచ్చు. హిందీ వెర్షన్ లో కూడా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అయ్యాయి. అక్కడి ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజున కోటి 25 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక ప్రాంతం నుండి రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, ఓవర్సీస్ నుండి అక్షరాలా 7 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది కాకుండా తమిళం, మలయాళం, కన్నడ భాషలకు కలిపి ఈ చిత్రానికి మరో కోటి 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 26 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఇక రెండవ రోజు ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం చూస్తే మొదటి రోజుకంటే ఎక్కువ వసూళ్లు వచ్చేలాగా అనిపిస్తుంది. బుక్ మై షో యాప్ లో ప్రస్తుతానికి ఈ చిత్రానికి గంటకు 20 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. మొదటి రోజు బుక్ మై షో యాప్ లో ఓవరాల్ గా 3 లక్షల టిక్కెట్లకు పైగా అమ్ముడుపోయాయి. రీసెంట్ సమయం లో స్టార్ హీరోలకు కూడా మొదటి రోజు ఈ రేంజ్ లో టిక్కెట్లు అమ్ముడుపోలేదు. ఇదే ఊపు ని కొనసాగిస్తూ ముందుకు పోతే ఈ చిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్ లో హనుమాన్ లాగా 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టొచ్చు.