Jasmine Health Benefits: మల్లెపూలను ఇష్టపడని ఆడవాళ్లు ఉండరు. సృష్టిలో దొరికే అందమైన పూలలో మల్లెపూలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. మల్లె పూలు ఇచ్చే పరిమళం ఎంతో బాగుంటుంది. వేసవి సీజన్‌లో మల్లెపూలు విరివిగా దొరుకుతుంటాయి. అయితే మల్లెపూలు సువాసనకే కాదు ఆరోగ్యానికి దివ్య ఔషధంలా కూడా పనిచేస్తాయని మనలో చాలా తక్కువ మందికి తెలుసు.

మల్లెపూలు మానసిక ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఈ మల్లెపూలను మెత్తగా నూరి తడిబట్టలో చుట్టి కళ్లమీద పెట్టుకుంటే కళ్లలో నీరు కారడం, తడి ఆరిపోవడం, కళ్ల మంటలు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మరోవైపు మల్లెపూల నుంచి తీసిన రసాన్ని ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.
Also Read: కేసీఆర్ తో గ్యాప్.. సమ్మక్క-సారక్క వివాదంపై చినజీయర్ స్వామి హాట్ కామెంట్స్
మధుమేహంతో బాధపడేవారు మల్లెపూలతో చేసిన టీ తాగితే చాలా మంచిది అని వైద్యులు సూచిస్తున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే గుణం మల్లెలకు ఉంది. అందుకే మల్లెపూల టీ ఆరోగ్యానికి మంచిది. అంతేకాకుండా కొబ్బరినూనెలో నానబెట్టిన మల్లెపూల నుంచి వచ్చిన రసాన్ని తలకు రాసుకుంటే జుట్టు కుదళ్లు గట్టిపడుతాయి. దీనికోసం గుప్పెడు మల్లెపూలను వేసి ఒకరోజంతా నానబెట్టాలి. ఆ తరువాత కాచి వడగట్టాలి. చల్లారాక తలకు మర్దన చేసుకోవాలి.

మానసికంగా బాధపడేవారు, ఒత్తిడిలో ఉన్నవారు, కోపంతో ఊగిపోయేవారు మల్లెపూల వాసన చూస్తే వాళ్ల మనసు శాంతిస్తుంది. అందుకే చక్కటి సువాసన వెదజల్లే గుప్పెడు మల్లెపూలను తల దిండు పక్కనే పెట్టుకుని నిద్రిస్తే మంచి నిద్ర పడుతుంది. మనసు స్థిమితంగా కూడా మారుతుంది. మల్లెపూలు మనిషిలోని శృంగార రసాన్ని కూడా పెంపొదిస్తాయి. అందుకే శోభనం గదిలో మంచం మీద మల్లెపూలను ఉంచడం సంప్రదాయంగా వస్తోంది.
Also Read: గ్లోబల్ లీడర్ గా మోడీ.. మరో రికార్డ్