January 9: చరిత్ర ఎప్పుడూ ఆసక్తిగా ఉంటుంది. అలాగే చరిత్రలో ప్రతీరోజు ఏదొక ఓ ప్రత్యేకమైన సంఘటనను జరిగే ఉంటుంది. అందుకే.. ప్రతి రోజుకు ఉండే ఆ ప్రత్యేకతలు మీ కోసం. ఇక ఈ జనవరి 9 నాడు కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం.

నేడు ప్రవాస భారతీయుల దినోత్సవం. 1915లో ఇదే రోజున మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారత్‌కు తిరిగివచ్చారు. అందుకే ఈ తేదీని, ప్రవాస భారతీయుల దినోత్సవం అంటూ 2003 నుండి ప్రభుత్వం నిర్ణయించింది.
నోబెల్ బహుమతి పొందిన ప్రఖ్యాత జీవ శాస్త్రజ్ఞుడు హరగోవింద్ ఖురానా జననం నేడే. ఇదే రోజు ఆయన 1922 లో పుట్టారు.
భారతీయ నేపథ్య గాయకుడు మహేంద్ర కపూర్ జననం నేడే. ఇదే రోజు ఆయన 1934 లో పుట్టారు.
భారతీయ సినిమా దర్శకురాలు, నటి, కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ జననం నేడే. ఇదే రోజు ఆయన 1965 లో పుట్టారు.
వెస్ట్‌ఇండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు జిమ్మీ ఆడమ్స్ జననం నేడే. ఇదే రోజు ఆయన 1968 లో పుట్టారు.
మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ప్రారంభమైంది. ఇదే రోజు 1969 లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ప్రారంభమైంది.
Also Read: Seven Days: వారానికి ఏడు రోజులు ఎందుకు ఉన్నాయి.. ఇలా ఉండటానికి కారణం ఏంటో తెలుసా?
భారత శాస్త్రవేత్తల బృందం మొదటిసారి 1982లో ఇదే రోజు అంటార్కిటికా ను చేరింది.
ప్రముఖ తెలంగాణ జానపద గీత రచయిత, గాయకుడు మిట్టపల్లి సురేందర్ జననం నేడే. ఇదే రోజు ఆయన 1985 లో పుట్టారు.
ప్రపంచ తెలుగు సమాఖ్య 8వ ద్వైవార్షిక సమావేశాలు విజయవాడలో ప్రారంభమయ్యాయి. ఇదే రోజు 2009 లో ఆ సమావేశాలు ప్రారంభమయ్యాయి.