Modi: దేశంలో మళ్లీ మునుపటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కరోనా మహమ్మారి భయాలు ఇక ఉండవు అనుకునే టైంలోనే మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నాయి. వీకెండ్ లాక్ డౌన్ కూడా పెట్టే ఆలోచన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రప్రభుత్వం కంప్లీట్ లాక్ డౌన్ దిశగా ఆలోచన చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దేశంలో థర్డ్ వేవ్ మొదలైందనే భయాందోళనలు ఉన్న నేపథ్యంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

దేశంలో రోజు లక్షన్నరకు పైగా కొత్త కేసులు వస్తున్నాయి. ఇప్పటికే కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య ఆరు లక్షలకు చేరువలో ఉంది. ఈ క్రమంలోనే పాజిటివిటీ రేటు కూడా పెరుగుతున్నది. మొత్తంగా భయాందోళన పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువ నమోదవుతున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం సాయంత్రం 4:30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు.
ఇందుకు షెడ్యూల్ ఖరారు అయింది. ఈ మీటింగ్‌లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ భాయ్ మాండవీయ, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. దేశంలో కొత్త కేసులు బాగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడికిగాను కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. కొవిడ్ మహమ్మారి కట్టడికిగాను సరి కొత్త ప్రొటోకాల్స్ రూపొందించాలని అధికారులు భావిస్తున్నట్లు టాక్.
Also Read: Omicron: ఒమిక్రాన్ కారణంగా దేశంలో థర్డ్ వేవ్?
పలు రాష్ట్రాల్లో ఇప్పటికే వీకెండ్ కర్ఫ్యూ అమలులో ఉంది. ఇకపోతే జనం మళ్లీ లాక్ డౌన్ ఉండబోతుందనే ఆలోచన నేపథ్యంలో నిత్యావసర సరుకులు ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే, సంపూర్ణమైన లాక్ డౌన్ దిశగా మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తుందా? లేదా ఆంక్షలతో కూడిన పాక్షిక లాక్ డౌన్ అమలు చేస్తుందా అనేది ఈ రోజు మీటింగ్ తర్వాత స్పష్టం కానుంది. దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ అమలు చేయాల్సిన విధానాలపైన కూడా ప్రధాని చర్చించనున్నారు.
Also Read: PM Modi’s security: పంజాబ్ లో మోడీకి భద్రతా వైఫల్యం..కేంద్రానికి సుప్రీం షాక్
[…] Also Read: Modi: లాక్ డౌన్ దిశగా మోడీ అడుగులు? […]