Jackfruit Alcohol Test: మద్యం తాగి వాహనం నడిపితే ఎంతో ప్రమాదకరం. మద్యం తాగడం వల్ల మనసు ఆందోళనగా ఉంటుంది. ఇలాంటి సమయంలో వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చాలామంది మద్యం తాగి వాహనాలు నడిపి ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. వారి ప్రాణాలు పోవడం మాత్రమే కాకుండా వారి కుటుంబానికి ఎంతో భారంగా మారుతుంది అని.. అలాగే పెద్ద వాహనం నడిపే వారైతే వారి వాహనంలో ఉండే వారికి ఎంతో నష్టం జరిగిన సంఘటనలు ఎన్నో చూశాం. అందువల్ల మద్యం తాగి ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడపవద్దని పోలీసులు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలో మద్యం తాగి వాహనం నడపకుండా బ్రీత్ అనలైజ్ టెస్టు చేసి మద్యం సేవిస్తే వారికి జరిమానాలు విధిస్తూ ఉంటారు. అయితే మద్యం తాగకుండా కూడా బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో పాజిటివ్ వస్తే ఎలా? అది ఈ పండు తినడం ద్వారా రావడం మరింత ఆందోళనకరం.. ఇంతకీ ఏ పండు తింటే బ్రీత్ ఎనలైజర్ టెస్టులో పాజిటివ్ వస్తుంది?
Also Read: బాడీలో ఏ ఫుడ్ ఎంత సేపట్లో అరుగుతుందో తెలుసా?
ఇటీవల కేరళకు చెందిన ఓ డ్రైవర్ కు పోలీసులు బ్రీత్ అనలైజర్ ద్వారా టెస్టు చేశారు. ఇక్కడ ప్రతిరోజు మద్యం డిపోలో డ్రైవర్లకు ఇలాంటి టెస్టులు నిర్వహిస్తారు. ఇందులో నెగటివ్ వస్తేనే డ్రైవింగ్ చేయడానికి అనుమతిస్తారు ఇందులో భాగంగా ఇటీవల నిర్వహించిన టెస్టులో ఓ డ్రైవర్ కు మద్యం తాగినట్లు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. అతడు మద్యం తాగాడని పోలీసులు చెప్పారు.
వాస్తవానికి ఆ డ్రైవర్ ఆ సమయంలో ఎటువంటి మద్యం తీసుకోలేదు. ఆ విషయాన్ని అతడు గట్టిగా చెప్పాడు. కావాలంటే మరోసారి టెస్ట్ చేయమని చెబుతూ వాదించాడు. దీంతో తీవ్రంగా పరిశీలించిన పోలీసులు అసలు ఉదయం నుంచి నీవు ఏమి తీసుకున్నావు? అని అడిగారు. అప్పుడు ఆ డ్రైవర్ కొన్ని రకాల పండ్ల గురించి చెప్పాడు. వీటిలో పనసపండు కూడా ఉందని పేర్కొన్నాడు. దీంతో మిగతా పండ్ల కంటే పనస పండు విషయంలో పోలీసులకు అనుమానం వచ్చింది. అప్పటికప్పుడు పోలీసులు కొంతమందిని పనసపండు తినమని చెప్పారు. ఆ తర్వాత వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. ఇది తిన్న అందరికీ పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. దీంతో పనస పండు తింటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో పాజిటివ్ రిజల్ట్ వస్తుందని తేల్చారు.
పనస పండులో అనేక ప్రోటీన్లు ఉంటాయి. కానీ దీనిని తినడం వల్ల కడుపులో గ్యాస్ లాగా తయారై ఆల్కహాల్ ఉన్నట్లు చూపిస్తుంది. ఇందులో బాగా పండిన పనసపండు తింటే ఆల్కహాల్ తీసుకున్నట్లే అవుతుందని పోలీసులు చెప్పారు. ముందుగా టెస్టు నిర్వహించిన డ్రైవర్ బాగా పండిన పనసపండు తిన్నాడని.. అందుకే అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో పాజిటివ్ రిజల్ట్ వచ్చిందని నిర్ధారణకు వచ్చారు. దీంతో ఆల్కహాల్ తీసుకోకుండా.. బాగా పండిన పనస పండు తింటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పాజిటివ్ రిజల్ట్ వస్తుందని చెబుతున్నారు.