Tips for Smart Investing: డబ్బు ఎవరికైనా అవసరమే. నేటి జీవితంలో డబ్బు ప్రధాన వనరు. అయితే అన్ని సమయాల్లో ఆదాయం అనుకున్నంతగా రాదు. భవిష్యత్తులో వయసు మళ్ళిన తర్వాత తక్కువ సంపాదన ఉంటుంది. అందుకోసం ముందుగానే డబ్బులు కావాల్సినంత సంపాదించుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో కొన్ని అవసరాల కోసం డబ్బులు దాచుకోవాలి. అయితే మామూలుగా డబ్బులు దాచుకుంటే పలు అవసరాలకు ఉపయోగపడదు. కానీ కొన్ని రకాల పెట్టుబడులు పెడితే రెట్టింపుగా మారి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. కొంతమంది డబ్బు రెట్టింపు కావడానికి ఫిక్స్డ్ డిపాజిట్ లేదా రియల్ ఎస్టేట్ వంటి వాటిలో పెట్టుబడును పెడతారు. కానీ వాటికంటే ఇందులో పెట్టుబడులు పెట్టడం వల్ల డబ్బు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రముఖ రచయిత రాబర్ట్ కియో సాకి తెలిపారు. మరి ఎందులో డబ్బు పెడితే ఎక్కువ లాభాలు వస్తుంది?
ప్రముఖ రచయిత రాబర్ట్ కియో సాకి రచించిన Rich Dad Poor Dad అనే పుస్తకం ప్రకారం డబ్బును వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టాలని సూచిస్తుంది. ప్రస్తుతం సాధారణ డిపాజిట్ ల కంటే బంగారం, బిట్ కాయిన్స్ వంటి వాటిలో డబ్బు పెట్టడం వల్ల ఎన్నో రకాలుగా ఉపయోగం ఉంటుందని అన్నారు. ప్రస్తుతం బంగారం లక్ష రూపాయలకు పైగా ధర పలుకుతుంది. భవిష్యత్తులో ఇది 9 లక్షల గా మారే అవకాశం ఉందని అంటున్నారు. రాను రాను బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే సమాజంలో సాధారణ డబ్బు కంటే బంగారం విషయంలోనే ఎక్కువగా ఆసక్తి చూపుతారని పేర్కొన్నారు. బంగారం ను కేవలం ధరించడానికి మాత్రమే కాకుండా పెట్టుబడులకు అనుగుణంగా మార్చుకుంటారని తెలిపారు. అంతేకాకుండా లిక్విటీ డబ్బు కంటే ఇలాంటి ఆన్లైన్ డబ్బులు ఎక్కువగా అందుబాటులో ఉంచుకుంటారని తెలిపారు.
Also Read: ప్రపంచ ఆర్థిక రంగంలో దూసుకుపోతున్న భారత్.. 2028నాటికి ఏ ప్లేసులో ఉంటుందో తెలుసా?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బిట్ కాయిన్ హవా నడుస్తోంది. ఇప్పటికే చాలామంది ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేశారు. అయితే ఇందులో పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్తులో అనేక లాభాలు ఉండే అవకాశం ఉందని రాబర్ట్ కియో సాకి తెలిపారు. కాగితపు డబ్బులు దాచుకోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని.. ఆన్లైన్లో డబ్బు నిల్వ చేసుకోవడం వల్ల ఎన్నో రకాలుగా ఉపయోగ ఉంటుందని ఆయన చెప్పారు. భవిష్యత్తులో డిజిటల్ చెల్లింపులు పెరిగే అవకాశం ఉంటుందని.. అందువల్ల ఆన్లైన్లోనే డబ్బులు ఎక్కువగా అందుబాటులో ఉంటాయని చెప్పారు. బంగారం, బిట్ కాయిన్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టడం వల్ల ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగి డబ్బు రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. బంగారం ధరించని దేశాల్లో కూడా దీనిపై ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అందువల్ల ఆన్లైన్లో డబ్బు అందుబాటులో ఉండాలని అనుకునేవారు వీటిపైనే ఎక్కువగా ఫోకస్ చేయాలని పేర్కొన్నారు. మనదేశంలో బంగారం ఆభరణాలుగా మాత్రమే చూస్తారు. కొందరు మాత్రమే దీనిపై ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటారు. ఇకనుంచి అయినా బంగారం పై ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎన్నో రకాలుగా లాభాలు ఉంటుందని రాబర్ట్ జియో సాకి పేర్కొన్నారు.