Mouth Shut:‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది..’అంటారు. మంచి మాటలతో ప్రపంచాన్నే ఆకట్టుకోవచ్చు. మనుషుల మధ్య కమ్యూనికేషన్ కొనసాగాలంటే మాట మంచిదై ఉండాలి. అయితే మనుషుల్లో రకరకాల ప్రవర్తన కలిగినవారు ఉన్నారు. అందువల్ల అందరి మాట ఒకే విధంగా ఉండదు. ఒక్కోసారి కొందరు మాట్లాడడం వల్ల మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. మరికొందరు మాట్లాడితే చికాకు అనిపిస్తుంది. కొన్ని సందర్బాల్లో చిన్న మాటతోనే పెద్ద వివాదం చెలరేగుతుంది. ఇలాంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని సందర్బాల్లో మాట్లాడకుండా ఉండడమే మంచిదని కొందరు మానసిక నిపుణులు అంటున్నారు. అసందర్భంగా మాట్లాడడం వల్ల చేసే పనిపై ధ్యాస ఉండకపోవడంతో పాటు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి ఎలాంటి సందర్భంలో మాట్లాడకుండా మౌనంగా ఉండాలి?
చాల మంది రోడ్డుపై నడిచే సమయంలో ఫోన్ మాట్లాడుతూ వెళ్తుంటారు. సాధారణంగా ఫోన్ లో సంభాసించేసమయంలో దృష్టి మొత్తం మాట్లాడే వారి పైనే ఉంటుంది. వారి గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. ఈ క్రమంలో మనం ఎటువైపు వెళ్తున్నామో గుర్తించం. ఇలాంటి సందర్భంగా ఫోన్లో మాట్లాడడం మంచిది కాదు. వీలైతో ఒక చోట ఆగి మాట్లాడిన తరువాతే ప్రయాణం కొనసాగించండి.
కొందరు ప్రశాంతమైన వాతావరణంలో ధ్యానం చేస్తుంటారు. ఇలాంటి వారు సైలెన్స్ ను ఎక్కువగా కోరుకుంటారు. కానీ కొందరు ఇలాంటి వారి వద్దకు వచ్చి అకారణంగా మాట్లాడుతూ ఉంటారు. వారి ప్రశాంతతను చెడగొట్టి మనసును పాడు చేస్తారు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు కూడా ఏర్పడుతాయి. అందువల్ల ధ్యానం చేసే సమయంలో మాట్లాడకుండా ఉండాలి. అంతేకాకుండా ఆలయాలకు వెళ్లిన సమయంలో జపం చేసే సమయంలో సైలెన్స్ గా ఉండాలి. కొందరు జపం చేస్తూ మాట్లాడుతారు. ఇలా చేయడం వల్ల జపం ఫలితం ఉండదు.
మాట్లాడుకుంటూ భోజనం చేయడం వల్ల ప్రశాంతంగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ మాట్లాడుకుంటూ భోజనం చేయడం వల్ల ఆహారం కడుపులోకి వెళ్లడానికి అడ్డంకులు ఏర్పడుతాయి. దీంతో ఒకే చోట ఆహారం ఆగి జీర్ణ సమస్యలు ఎదుర్కొంటారు. ఆ తరువాత అనేక అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల భోజనం సమయంలో ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకుండా ఉండాలి. అప్పుడే ప్రశాంతంగా శరీరంలోకి వెళ్లి ఆరోగ్యంగా ఉంటారు.
ప్రతిరోజూ ఉదయం కాలకృత్యాలు తీసుకునే సమయంలోనూ నోరు మెదపకుండా ఉండడమే మంచిది. ఓ వైపు మాట్లాడుకుంటూ ఈ పనులు చేయడం వల్ల మనసు ఆందోళనగా ఉంటుంది. దీంతో చేసే పనులు సక్రమంగా ఉండవు. అందువల్ల ఉదయం కాలకృత్యాలు తీర్చుకునే వరకు సైలెన్స్ ను పాటించడం మంచిది.
పూజ సమయంలోనూ నోటిని అదుపులో పెట్టుకోవాలి. ప్రశాంతమైన వాతావరణంలో పూజ చేయడం వల్ల వాటి ఫలితం దక్కుతుంది. లేకుంటే పూజలో ఆటంకాలు ఏర్పడుతాయి. ఇలా ఆటంకాలు సృష్టించేవారిపై దేవతలు ఆగ్రహిస్తారు. అందువల్ల ఈ సమయంలో నోటిని అదుపులో ఉంచుకోవడం మంచిది.
ఇద్దరు వ్యక్తుల్లో ఒకరికి కోపం వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి ప్రశాంతంగా ఉండాలి. లేకుంటే మౌనంగా ఉండాలి. అలా ఉండకుండా మాట్లాడడం చేస్తే గొడవ పెద్దదిగా మారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుంది.