https://oktelugu.com/

Sankranti 2025: కేవలం గుడ్డు ధరనే రూ.700.. సంక్రాంతి పందెంకోడి గుడ్లకు ఎందుకంత డిమాండ్.. ఇంట్రస్టింగ్ స్టోరీ*

అక్కడ కోడి కంటే గుడ్డు ధర ( egg rate) అధికం. అలాగని అది తినేందుకు కాదు. పందెం కోడిని తయారు చేసేందుకు నాటు కోళ్లతో పొదిగిస్తారు ఆ గుడ్డును.

Written By:
  • Dharma
  • , Updated On : January 7, 2025 / 02:56 PM IST

    Sankranti 2025(1)

    Follow us on

    Sankranti 2025: సంక్రాంతి( Pongal festival) సమీపిస్తోంది. కోడిపందాలకు శిబిరాలు సిద్ధమవుతున్నాయి. పందెం కోళ్ళు ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాయి. దీంతో కోస్తాంధ్రలో ( coastal Andhra) సందడి నెలకొంటోంది. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా ఇదే సందడి నెలకొంది. పందెం కోళ్ళకే కాదు.. అవి పెట్టే గుడ్లకు కూడా భలే డిమాండ్. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 700 రూపాయల వరకు పలుకుతోంది ఒక్క గుడ్డు ధర. పందెంకోడి ఏంటి? గుడ్లు పెట్టడం ఏంటి? అని అనుకుంటున్నారు కదా? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివావాల్సిందే. ప్రకాశం జిల్లా( Prakasam district) తీర ప్రాంతంలోని కొత్తపట్నం, సింగరాయకొండలో గుడ్లను జాతి పెట్టలతో పొదిగించి.. పుంజులను ప్రత్యేకంగా సంరక్షిస్తుంటారు. వాటినే పందెం కోళ్ళుగా బరిలో దింపుతారు. కోస్తాంధ్రతో పాటు ఉభయగోదావరి( Godavari district) జిల్లాల్లో కోళ్ల పందాలు జరుగుతాయి. కానీ అక్కడి పుంజులను మాత్రం అందించేది ప్రకాశం జిల్లా.

    * రకరకాల కోళ్లు
    పందెం కోళ్లలో రకరకాల కోళ్లు ఉంటాయి. వీటిలో ప్రధానంగా తూర్పుకోడి, పెర్విన్ కోడి, భీమవరం కోడి, ఎర్ర మైల, అబ్రాస్ మైల, కాకి నెమలి, తెల్ల నెమలి, నల్లపడ కోడి, కాకి డేగ, ఎర్ర కక్కెర, తెల్ల కోడి, కాకి నెమలి, పెట్టమారు వంటి పుంజులు సంక్రాంతి( Pongal festival ) బరిలో దిగుతాయి. అయితే ఈ పుంజులకు సంబంధించి పుట్టుక వెరైటీగా ఉంటుంది. నల్ల పెట్ట, డేగ పెట్ట, తెల్ల పెట్ట, బూడిద రంగు పెట్ట, అబ్రాసు పెట్ట, కక్కెర పెట్టలు పందెం కోడిపుంజులతో కలవడం ద్వారా.. గుడ్లు పెడతాయి. కానీ ఇది పొదగవు. ఈ గుడ్లను ప్రత్యేక నాటు కోళ్లతో పొదిగిస్తారు. అందుకే ఈ గుడ్డుకు అంత ధర. ఒక్కో గుడ్డు 400 నుంచి 700 వరకు విక్రయిస్తారు. డిమాండ్ బట్టి వీటి ధర పెరిగిపోతుంటుంది. అయితే ఈ గుడ్లు తినే కంటే.. పందెం కోళ్ళుగా తీర్చిదిద్దేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. భరత్ పెరగడానికి అదే కారణం.

    * రెండేళ్ల పాటు రక్షణ
    నాటు కోళ్లతో పొదిగించే క్రమంలో.. గుడ్డు పెట్టిన తర్వాత మూడు వారాలకు పిల్ల అవుతుంది. అప్పటినుంచి రెండేళ్ల పాటు వాటికి ప్రత్యేక ఆహారం( special food) పెడతారు. సుమారు ఏడాదిన్నర పాటు రాగులు, సజ్జలు పెడుతుంటారు. తరువాత ఆరు నెలలు కాలం బాదం, ఖర్జూరం, అంజూర్, యాలుక, రసగుల్లా, రంగుల ద్రాక్ష, క్రిస్మస్, నాటు కోడి గుడ్డు వంటి బలవర్ధకమైన ఆహారాన్ని పెడతారు. కొన్నింటికి పోతు మాంసం కూడా పెడుతుంటారు. దీనిని తినడం ద్వారా పుంజు బలంగా ఉండడమే కాక బరిలో అవతలి పుంజును సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. అయితే కొత్తపట్నం, సింగరాయకొండ మండలాల్లో ఇదో కుటీర పరిశ్రమగా( house industry) మారింది. కొంతమంది కోడిగుడ్లను అమ్ముకుంటూ ఉపాధి పొందుతుండగా.. మరికొందరు పందెం పుంజులను విక్రయించి జీవనం సాగిస్తున్నారు.