Zodiac Signs: ఎవరైనా ఏదైనా సాధిస్తే వాడి గీత బాగుంది అందుకే దూసుకుపోతున్నాడు అంటారు. కోటీశ్వరుడైతే వాడి అదృష్టం బాగుంది అని చెబుతారు. ఇంకా అకుంఠిత దీక్షతో అనుకున్నది సాధిస్తే వాడికి జ్యోతిష్యం సహకరించింది అని అంటుంటారు. ఇలా మనకు నిత్యం సాయపడేవి రాశులే అని నమ్మేవారు కూడా ఉన్నారు. చాలా మంది లక్షాధికారులు, కోటీశ్వరులు కావాలని కలలు కంటుంటారు. కానీ దానికి గల కష్టాన్ని మాత్రం నమ్ముకోరు. దీంతో వారి మనుగడ కొంత కష్టంగానే ఉంటుంది. ఇంకా కొందరు నిరంతరం కష్టపడుతుంటారు. జీవితంలో సంపాదన మాత్రం వారికి దక్కదు. ఇలా ఎవరి జాతకం చూసినా అన్ని పూలదారులు కాదు ముళ్ల దారులే. ఈనేపథ్యంలో ఆరు రాశుల వారికి మాత్రం కోటీశ్వరులయ్యే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యం చెబుతోంది. వారు కష్టపడి పనిచేస్తే ధనవంతులు కావడం పెద్ద విషయమేమీ కాదని తెలియజేస్తున్నారు. ఇంతకీ ఆ రాశులేంటో తెలుసా?

తులరాశి వారిలో క్రమశిక్షణ, పట్టుదల, సాధించాలనే తపన బాగా ఉంటుంది. అందుకే వారు జీవితంలో ఎదగడానికి నిరంతరం శ్రమిస్తారు. అందరి కాకుండా భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో వారు నిత్యం పనులు చేస్తూనే ఉంటారు. దీంతో జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఇలా కోటీశ్వరులైన వారిలో వాల్ఫ్ లారెల్, స్టీఫెన్ ెర్సన్, ఆలిన్ వాల్టన్ ఉన్నారు. వీరు కష్టపడి ఎంతో ఎత్తుకు ఎదిగారు. కష్టపడి పనిచేసి ఎన్నో ఫలితాలు సాధించారు.
కోటీశ్వరులు కాగల రెండో స్థానంలో ఉన్న వారిలో మీన రాశివారు ఉన్నారు. వీరు కూడా సృజనాత్మకంగా వ్యవహరిస్తారు. కలలు, వాస్తవికతకు దూరంగా ఉంటారు. జీవితాన్ని మంచి స్థానంలో ఉంచుకునేందుకు నిరంతరం శ్రమిస్తారు. వారికున్న సామర్థ్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేసే శక్తి గలవారు. దీంతో లక్ష్యాలను అధిగమించి బాగా డబ్బు సంపాదించే మార్గాలు ఇట్టే కనిపెడతారు. ఫలితంగా కోటీశ్వరులు కాగల సత్తా వీరిలో ఇమిడి ఉంటుంది. అనుకున్న పనిని అనుకున్నట్లుగా చేయడంలో దిట్టలు.
అత్యంత సమర్థుల్లో మూడో రాశి వారు కర్కాటరాశి వారు. వీరు కూడా మంచి నాయకులు. వీరికి బలమైన నిబద్ధత కలిగి ఉంటారు. జీవితంలో ఎదురయ్యే వాటిని అధిగమించి లక్ష్యసాధనకు శ్రమిస్తారు. వ్యాపార లావాదేవీల్లో తమదైన శైలిలో రాణించి డబ్బు సంపాదిస్తుంటారు. వ్యాపార వేత్తలైన గౌతం అదానీ వంటి వారు ఈ రాశికి చెందిన వారే కావడం గమనార్హం. తలుచుకుంటే కోటీశ్వరులు కావడం వీరికి పెద్ద కష్టమేమీ కాదు. మంచి ఆలోచనా ధోరణితో ఆకట్టుకుని వారు అనుకున్నది సాధించడంలో వీరికి వీరే సాటి.

ఇదే కోవలో వృషభ రాశి వారు కూడా ఉన్నారు. పట్టుదలతో పనులు చేయడంలో సిద్ధహస్తులు. పని మీదే ఫోకస్ పెడతారు. విలాసవంతమైన జీవనం గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. దీని కోసం నిరంతరం తపన పడుతుంటారు. వీరిలో ఫేస్ బుక్ స్థాపకుు మార్క్ జుకర్ బర్గ్, కోచ్ ఇండస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ కోచ్ వంటి వారు ఉన్నారు. వీరు పట్టుబడితే అంతే సాధించాల్సిందే. ఇలా వారి జీవితంలో ఎన్నో విజయాలు సొంతం చేసుకుని కోటీశ్వరులు అయిన వారిలో చాలా మంది ఉండటం గమనార్హం.
సింహరాశి వారు కూడా కోటీశ్వరులు కావడంలో ముందే ఉంటారు. వీరు వ్యాపార వేత్తలుగా మారతారు. సృజనాత్మకమైన ఆలోచనలతో కొత్తదనానికి ప్రాధాన్యం ఇస్తారు. సొంత మార్గాన్ని ఎంచుకుని ఎదురు లేకుండా దూసుకుపోతుంటారు. ఇందులో ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ ఉన్నారు. నూతన వ్యాపార మార్గాలు అనుసరిండంలో దిట్టలు. జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి కష్టపడుతుంటారు. అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు. అందుకే కోటీశ్వరులు కావడానికి నిరంతరం మార్గాలు అన్వేషిస్తారు.
వృశ్చిక రాశి వారు కూడా మంచి అభిరుచి గల వారు. వీరు ఉద్వేగభరితమైన, సహజమైన వ్యక్తులు. డబ్బును నియంత్రణలో ఉంచుతారు. కుటుంబ సంబంధాల కంటే డబ్బు సంపాదనే ప్రధాన కర్తవ్యంగా భావిస్తుంటారు. అనుకున్న గమ్యాన్నిచేరుకోవడానికి అలుపు లేకుండా పోరాడతారు. వీరిలో ఎయిర్ టెల్ సునీల్ మిట్టల్, ఏషియన్ పెయింట్స్ అశ్విన్ డానీ ఉన్నారు. ఈ రాశి వారికి అన్ని రంగాల్లో కలిసొస్తుంది. దీంతో వారు తొందరగానే కోటీశ్వరులవుతుంటారు. ఇలా ఈ ఆరు రాశుల వారికి జీవితంలో కోటీశ్వరులయ్యే అవకాశాలు విరివిగా వస్తుంటాయి. వాటిని సద్వినియోగం చేసుకుని ఎదిగేందుకు మార్గాలు అన్వేషించుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంది.