Extramarital Affairs: ఈ కారణాలతోనే వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారట..

నేటి కాలం యువతీయువకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. పెళ్లికి ముందు ఎన్నో ఊహించుకొని.. పెళ్లయిన తరువాత వారు అనుకున్నవి కనిపించకపోవడంతో భాగస్వామిపై అయిష్టతను పెంచుకుంటున్నారు.

Written By: Chai Muchhata, Updated On : September 12, 2023 9:18 am

Extramarital Affairs

Follow us on

Extramarital Affairs: పెళ్లంటే నూరేళ్ల పంట. కానీ ఇటీవల జరుగుతున్న పెళ్లిళ్లు కొద్ది రోజులకే పెటాకులవుతున్నారు. జెట్ స్పీడుగా వివాహం చేసుకున్నవాళ్లు రాకెట్ స్పీడ్ తో విడాకులు తీసుకుంటున్నారు. అయితే కొందరు ఎంతో ఇష్డపడి పెళ్లిళ్లు చేసుకున్నా.. కొద్ది రోజుల్లోనే మరొకరితో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఆడ, మగ ఎవరైనా తన భాగస్వామిపై అయిష్టంతోనే ఇతరులతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. అయితే దీనిని కొందరు మోసం అని అంటున్నారు. మరికొందరు మాత్రం తనతో సక్రమంగా లేకనే ఇతరులను ఇష్టపడుతున్నట్లు చెబుతున్నారు. అసలు పెళ్లయిన కొద్దిరోజులకే ఇలా ఎందుకు వేరొకరితో సంబంధాలు పెట్టుకుంటున్నారు?

నేటి కాలం యువతీయువకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. పెళ్లికి ముందు ఎన్నో ఊహించుకొని.. పెళ్లయిన తరువాత వారు అనుకున్నవి కనిపించకపోవడంతో భాగస్వామిపై అయిష్టతను పెంచుకుంటున్నారు. పెళ్లికి ముందు పెద్ద ఇల్లు,కారు, బ్యాంకు బాలెన్స్, జీతం ఊహించుకొని మగవాళ్లను ఇష్టపడుతున్నారు. ఆ తరువాత అవి కనిపించకపోవడంతో ఇతరుల వలలో పడుతున్నారు. అయితే ఇది అందరి విషయంలో జరగకున్నా.. కొందరు పరిస్థితి చూస్తే అర్థమవుతోంది.

పురుషులు, మహిళలు వేర్వేరు కారణాలతో తమ భాగస్వాములను మోసం చేయవచ్చు. పురుషులు ఎక్కువగా సెక్స్ లేదా ఆ రకమైన ఆనందాన్ని తన భాగస్వామి నుంచి కోరుకుంటాడు. ఈ విషయంలో తేడా వచ్చినప్పడు ఇతరుల వైపు చూస్తాడు. కానీ మహిళలు మాత్రం బావోద్వేగాలు కోరుకునే అవకాశాలు ఉన్నాయి. పురుషులు తమపై ఎంత ప్రేమ చూపుతున్నారు? ఎంత ఆదరిస్తున్నారు? అనేది చూస్తారు. ఈ విషయంలో కాస్త నిర్లక్ష్యం చేస్తే వేరే సంబంధాలు పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు.

ప్రధానంగా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడానికి కోపం, తక్కువ ఆత్మగౌరవం, ప్రేమ లేకపోవడం, తక్కువ నిబద్ధత, వైవిద్యం, అవసరం, నిర్లక్ల్ష్యం, లైంగిక వ్యసనం అనే కారణాలు ఉంటాయి. వీటిలో ఏ రకంగానైనా ఇవి తక్కువగా ఉన్నప్పుడు మనస్పర్థలు వస్తుంటాయి. దీంతో ఎదుటివారిని మోసం చేయడానికికైనా వెనుకాడని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయాల్లో తమకు అన్యాయం జరిగినప్పుడు ద్రోహం చేసినా తప్పులేదని భావిస్తారట. ఇప్పుడున్న కాలంలో చాలా మంది బావోద్వేగాలపైనే జీవితాలు సాగుతున్నాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇతరుపై చూపించే ప్రేమ, ఆప్యాయతలు తక్కువ కాకుండా ఉండడం వల్ల వారి మధ్య ప్రేమానురాగాలు కొనసాగుతాయి.