Hair Whitening: మన దైనందిన జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పాతికేళ్లకే జబ్బులు వస్తున్నాయి. ఆహార అలవాట్లు మనల్ని జబ్బులకు దగ్గర చేస్తున్నాయి. జీవనశైలి రూపాంతరం చెందుతోంది. దీంతో మనకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇరవైలోనే అరవైలా మారుతున్నారు. ఈ నేపథ్యంలో మన శరీరం పలు రకాల రోగాలకు కేంద్రంగా నిలుస్తోంది. అయినా మన అలవాట్లు మార్చుకోవడం లేదు. ఫలితంగా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం, ఊడిపోవడం లాంటి సమస్యలతో సతమతమవుతున్నారు. జుట్టు నెరసిపోవడంతో నలుగురిలో తిరిగేందుకు జంకుతున్నారు. నామోషీగా ఫీలవుతున్నారు. జుట్టుకు రంగులు వేసుకుని కాలం గడుపుతున్నారు.

జుట్టు తెల్లబడటానికి కారణం విటమిన్ల లోపమే అని తెలిసినా నివారణ చర్యలు తీసుకోవడం లేదు. ఎలాంటి జాగ్రత్తలు పాటించడం లేదు. విటమిన్ బి లోపం వల్ల జుట్టు తెల్లబడుతుందని చెబుతున్నారు. జుట్టు రాలడం కూడా జరుగుతుంది. దీంతో విటమిన్ బి మన శరీరానికి అత్యవసరమైన పోషకంగా మారింది. జీవక్రియ మెరుగుపడటం, ఎర్ర రక్తకణాలు పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. విటమిన్ బి మన ఆహారాల్లో ఉండేలా చూసుకోవాలి. విటమిన్ బి, విటమిన్ బి6, విటమిన్ బి12 మనకు సరిగా అందేలా జాగ్రత్త వహించాలి.
విటమిన్ బి ఎందులో దొరుకుతుంది? దాంతో మనకు కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం. గుడ్లు, సోయాబీన్, పెరుగు, ఓట్స్, మిల్క్ చీజ్, బ్రోక్ లీ, సాల్మన్, చికెన్, గ్రీన్ లీఫీ, కూరగాయలు, తృణధాన్యాలు వంటి వాటిలో మనకు బి విటమిన్ పుష్కలంగా దొరుకుతుంది. అందుకే వీటిని తీసుకుని మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలి. అప్పుడే మనకు అనారోగ్యం కలగకుండా ఉంటుంది. శరీరంలో విటమిన్ బి లోపిస్తే కలిగే ఇబ్బందుల దృష్ట్యా మనం కచ్చితమైన ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది.

విటమిన్ల లోపంతో మనకు కలిగే నష్టాలు అనేకం. దీంతో మనం తీసుకునే ఆహార పదార్థాలు ఎంచుకుని మరీ తీసుకోవాలి. ఏది పడితే అది కడుపులో తోసేస్తే కీకారణ్యంగా మారుతుంది. విటమిన్లు సరిగా లేని ఆహారంతో మనకు చిక్కులు ఏర్పడతాయి. చిన్న వయసులో జుట్టు రాలిపోవడం, తెల్లబడటం లాంటివి జరగకుండా ఉండాలంటే విటమిన్లు లభించే ఆహారాలను తినాలి. పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకుంటే విటమిన్లు మనకు పుష్కలంగా లభిస్తాయి. విటమిన్లు మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. అందుకే విటమిన్ బి మన శరీరానికి ఆవశ్యకత ఉండటంతో దాన్ని మనం విరివిగా తీసుకుంటే ప్రయోజనం.