Dangerous Dish: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వంట ఇదే..?

Dangerous Dish: ఎంతో మంది దేశవిదేశాలు తిరుగుతూ వారికి ఇష్టమైన ఆహార పదార్థాలన్నింటినీ రుచి చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరికొందరైతే ప్రస్తుతం ఆ ఫుడ్ కి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ డబ్బులు కూడా సంపాదించుకుంటున్నారు. ఇలా ఆహార పదార్థాలను మనం జీవించడం కోసమే తింటాము. కానీ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ఈ ఆహార పదార్థాన్ని తయారు చేసే సమయంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా ఆ ఆహార పదార్థాలు తింటే […]

Written By: Navya, Updated On : December 7, 2021 12:21 pm
Follow us on

Dangerous Dish: ఎంతో మంది దేశవిదేశాలు తిరుగుతూ వారికి ఇష్టమైన ఆహార పదార్థాలన్నింటినీ రుచి చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరికొందరైతే ప్రస్తుతం ఆ ఫుడ్ కి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ డబ్బులు కూడా సంపాదించుకుంటున్నారు. ఇలా ఆహార పదార్థాలను మనం జీవించడం కోసమే తింటాము. కానీ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ఈ ఆహార పదార్థాన్ని తయారు చేసే సమయంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా ఆ ఆహార పదార్థాలు తింటే మనకు చావు తథ్యమని చెప్పవచ్చు. మరి ఆహార పదార్థం ఏమిటి అనే విషయానికి వస్తే…

Dangerous Dish

జపాన్‌లోని యమగుచి ప్రిఫెక్చర్‌ లో పాపులారిటీ సంపాదించుకున్న ఆహార పదార్థాలలో డెడ్లీ డిష్‌ ఒకటి.ఈ ఆహార పదార్ధం తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది అయితే దీన్ని తయారు చేసేటప్పుడు ఏ మాత్రం పొరపాటు జరిగినా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అందుకే ఈ ఆహార పదార్థాలను ప్రత్యేక లైసెన్స్ కలిగిన రిజిస్టర్డ్ చెఫ్ లతో తయారుచేస్తారు.

Also Read: ఈ సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే బొప్పాయిని దూరం పెట్టాల్సిందే!

జపాన్‌లోని షున్‌పాన్రో ఫుగూతో వంటకాలను తయారుచేస్తారు. ఫుగూలో టెట్రోడోటాక్సిన్ అనే విషం ఉంటుంది. పొరపాటున ఈ వంట తయారు చేసే సమయంలో ఈ విషయం కలిసి ఆ విషయం కలిగిన భోజనం చేయటం వల్ల ప్రాణాలు పోతాయి. అందుకే దీనిని డెత్లీ ఫుడ్ అని పిలుస్తారు. ఈ ఆహార పదార్థాలు ఎంత ప్రమాదకరం అని తెలిసిన తినడానికి రుచిగా ఉండటంతో వీటిని తినడానికి ఎంతో ఇష్టపడతారు. ఇక ఈ వంటకాన్ని ఎలా తయారు చేస్తారు అనే విషయానికి వస్తే..ప్రస్తుతం ఫుగూ చేపలను సన్నగా కట్ చేసి, స్ప్రింగ్ ఆనియన్స్‌తో చుట్టి, వెనిగర్, సోయా సాస్‌లో ముంచి దీనిని తింటారు.

Also Read: రాత్రిళ్ళు నిద్రసరిగా పట్టడం లేదా.. ఈ చిట్కాలు పాటించాల్సిందే?