Homeలైఫ్ స్టైల్Husband Wife Relationship: మీకు కాబోయే భ‌ర్త ఇలా చేస్తున్నాడా..? అయితే బీ కేర్ ఫుల్..

Husband Wife Relationship: మీకు కాబోయే భ‌ర్త ఇలా చేస్తున్నాడా..? అయితే బీ కేర్ ఫుల్..

Husband Wife Relationship: ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఓ పెద్ద వేడుక. అంతే కాదు ఆ క్షణం నుంచి వారి జీవితం మరొకరితో ముడిపడి పోతుంది. మరి అలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. తరాల వారిగా మాట ఎలా ఉన్న కలిసి బ్రతికేది మాత్రం భాగస్వామితోనే కాబట్టి పెళ్లి చేసుకోబోయే వారిలో ఎవైనా ఇబ్బంది కలిగించే లక్షణాలు కనిపిస్తే నో చెప్పడంలో ఎలాంటి తప్పు లేదంటున్నారు నిపుణులు. పరిచయానికి, పెళ్లికి మధ్యలో కొంత సమయంలో ఉంటుంది. ఆ టైంలో తనకు కాబోయే పార్ట్నర్ కు సంబంధించి ప్రవర్తన, అలవాట్లను తెలుసుకునే చాన్స్ ఉంటుంది. ఈ విషయాలను ముఖ్యంగా గమనించాలని చెబుతున్నారు నిపుణులు.

Husband Wife Relationship
Husband Wife Relationship

 

మాటతప్పకుండా ఉండేవారంటే అందరూ గౌవరవిస్తారు. మీకు కాబోయే పార్ట్నర్ సైతం మీకు ఇచ్చిన మాట మీద నిలబడుతున్నారో లేదో చూసుకోవాలి. అలా అని చిన్న చిన్న విషయాలను భూతద్దంలో పెట్టి చూడటం కరెక్ట్ కాదు. నిజంగానే మీకు ఇచ్చిన మాట ప్రకారం నడుచుకుంటున్నాడా? లేక ఏవో మాయ మాటలు చెప్పి దాటవేసే ప్రయత్నం చేస్తాన్నాడా? అని అబ్జర్వ్ చేయాలి. దీనికి తోడు మిమ్మల్ని అదుపులో పెట్టుకునేందుకు ప్రయత్నించడం, పరిమితులు విధించి బందీ చేయడం వంటింటి చేస్తుంటే జాగ్రత్తగా ఉండాలి. కాబోయే వారు ఒకరినొకరి ఇష్టాలు గౌరవించుకోవాలి. అంతే కానీ తాము చెప్పినట్టే పార్ట్నర్ వినాలని అనుకోవడం తప్పు అని నిపుణులు చెబుతున్నారు.

Also Read: స్కిప్ట్ నిజంగానే మారిందా? రాధాకృష్ణ వాదన అదే..

చాలా మంది పురుషులు పెళ్లికి ముందు పార్ట్నర్ ను ప్రేమగా చూసుకుని తర్వాత నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇంట్లో వారి ముందు భార్యను తక్కవ చేయడం వంటివి చేస్తుంటారు. ఇలాంటివి ఏ భార్య అయినా సహించదు. ఇలాంటి విషయాలను ముందే గమనించడం మంచిది. ఇరు కుటుంబసభ్యులను ఒకరికొకరు అండగా ఉండాలి.

కొందరు అత్తవారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇలాంటి వారి పట్ల జాగ్రత్త అవసరం. వీటితో పాటు అబద్దాలు చెప్పే వారు, పనికిరాని మాటలు మాట్లాడే వారు, మీ నమ్మకాలను, అభిప్రాయాలను లెక్క చేయడం లేదని మీకు అనిపిస్తే బీకేర్ ఫుల్. ఈ అంశాలను బట్టే మీకు కాబోయే భాగస్వామి నచ్చారా? లేదా అని డిసైడ్ చేసుకోండి. లేదంటే జీవితాంతం బాధపడక తప్పదు.

Also Read:  అత్యంత సన్నిహితుల మధ్య రెహమాన్ కూతురు ఎంగేజ్మెంట్… పెళ్లి కొడుకు ఎవరంటే ?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular