Jasmine: మనసు ప్రశాంతంగా ఉండాలంటే పూల సువాసన ఎంతో ఉపయోగపడుతుంది. కొన్ని రకాల పూలతో ఎంత ఒత్తిడి ఉన్న వెంటనే తగ్గిపోతుంది. అందుకే చాలామంది తలలో పూలను ఉంచుతారు. అలాగే ప్రతి పూజలో పూలను ఉపయోగిస్తారు. పూలల్లో ప్రధానంగా మల్లె గురించి ఎక్కువగా చర్చించుకుంటారు. మల్లెపూలు ఇచ్చే సువాసన ఎక్కువగా ఉంటుంది. మల్లెపూలు తెల్లగా ఉండడంతో శాంతికి చిహ్నం గా కూడా పేర్కొంటారు. ఆలీ కుటుంబానికి చెందిన తీగలా పెరిగే మల్లె ఆస్ట్రేలియా ఓసీ ఆసియా ప్రాంతాల్లో సుమారు 200 రకాల జాతులు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలుగా ఉన్నప్పటికీ జాస్మినం సంభక్ అనే రకాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తారు. ఇండియాలో దీనిని వెళ్లే ఆఫ్ ఇండియా ఎలాంగ్ డేటా అని కూడా అంటారు. శుభకార్యాలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలలో మల్లెలు ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే మల్లెపూలు ఇంట్లో పెంచుకోవడం అంత మంచిది కాదని కొందరు చెబుతున్నారు. ఎందుకంటే?
పూల జాతుల్లో అత్యంత సువాసనను కలిగించే మల్లెలు అంటే ఆడవారికి చాలా ఇష్టం. మల్లెపూలు ఇచ్చిన సువాసనతో మనసు ప్రశాంతంగా మారుతుంది. దీంతో చాలామంది మల్లె చెట్టును పెంచుకోవాలని అనుకుంటారు. కొందరు ప్రత్యేకంగా మల్లె తోటను నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఇంట్లో మల్లె చెట్టును పెంచుకునేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా సిటీల్లో మల్లె చెట్టును పెంచేవారు కొన్ని నియమాలు పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
అపార్ట్మెంట్లు లేదా తక్కువ ప్రదేశం ఉన్నవారు కూడా మల్లె చెట్టును ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఇవి తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలి. ఇలా వేలు కాకపోతే మల్లె చెట్టును పెంచుకోకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే అసభ్య దిశలో మల్లె చెట్టును పెంచుకోవడం వల్ల ఇంట్లో అరిష్టం ఉంటుందని అంటున్నారు. అలాగే దురదృష్టం వెంటాడుతుందని కొందరు చెబుతున్నారు. మల్లె చెట్టును ఇంటి లోపల పెంచుకోవద్దని కొందరు వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇది ఇంట్లో ఉండడం వల్ల డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుందని చెబుతున్నారు.
మల్లె చెట్టు క్షార నేలల్లో మాత్రమే ఆరోగ్యంగా పెరుగుతుంది. దీనిని ఇతర ప్రదేశాల్లో పెంచడం వలన ఆకులు మాడిపోతాయి. దీంతో వీటిపై ఉండే కీటకాలు ఇంట్లో వారికి కీడు చేస్తాయి. అందువల్ల మల్లె మొక్క పెంచిన ఆరోగ్యంగా లేకపోతే వెంటనే తీసివేయడం మంచిది. మల్లె చెట్టును ఎక్కువగా తేనెటీగలు ఆకర్షిస్తాయి. ఇవి ఉన్నచోటికి ఎక్కువగా ఇవి వస్తూ ఉంటాయి. అందువల్ల ఇది ఇంటిముందు ఉన్న తేనెటీగలు నిత్యం రావడంతో ఇంట్లో వారికి ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మల్లె చెట్టు ఇంట్లో ఉండడం వల్ల ఎలర్జీ ఉన్న వారిపై ప్రభావం పడుతుంది. దీంతో వారికి చర్మ సమస్యలు లేదా పిల్లలు పెంపుడు జంతువులకు అనుకూలంగా ఉండదు. మల్లె మొక్కలకు సరైన నీరు అందకపోవడంతో తొందరగా ఎండిపోతుంది. అయితే కొన్నిసార్లు నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ చెట్టు పనికిరాకుండా పోతుంది. అందువల్ల దీనిని ఇంట్లో పెంచుకోవడానికి సౌకర్యంగా ఉండదని వాస్తు శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.