America
America : మనిషి సగటున 60 నుంచి 80 ఏళ్ల వరకు జీవిస్తారు. కానీ, కొన్ని దేశాల్లో ఆయుర్ధాయం ఆ దేశాల పరిస్థితుల ఆధారంగా తక్కువ, ఎక్కువలుగా ఉంటుంది. అయితే అగ్రరాజ్యం అమెరికా(America)లో మాత్రం 200 ఏళ్లు దాటినవారు 2 వేల మందికిపైగా ఉన్నారట. క 360 నుంచి 369 ఏళ్ల వయసున్న వ్యక్తి కూడా ఒకరు సజీవంగా ఉన్నారట. ఈ విషయాన్ని అక్కడి సోషల్ సెక్యూరిటీ విభాగం చెబుతోంది. ఈ విషయాన్ని డోజ్(డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ)బృందం ధ్రువీకరించింది. తాజాగా దాని అధిపతి, ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్(Elan musk) ఈ విషయాన్ని ఎక్స్‌లో వెల్లడించారు. వందేళ్లు దాటిన వారు 2 కోట్ల మందికిపైగా ఉన్నారట. వీరు సోషల్ సెక్యూరిటీ లబ్ధికి అర్హుల జాబితాలో ఉన్నారని పేర్కొన్నారు. సోషల్ సెక్యూరిటీ అర్హుల జాబితా సంక్య అమెరికాలో ప్రస్తుత పౌరుల సంఖ్య కన్నా అధికంగా ఉందని వెల్లడించారు. చరిత్రలోనే అతిపెద్ద మోసమని పేర్కొన్నారు. వాస్తవానికి 2023లో సోషల్ సెక్యూరిటీ ఆడిట్‌లో దాదాపు 18.9 మిలియన్ల మంది వందేళ్లు దాటి ఉన్నట్లు గుర్తించారు. వారు ఆదాయం పొందడం లేదా లబ్ధి స్వీకరించడం కానీ, చేయడం లేదు. అయినా జాబితాను సవరించలేదు.
65 లక్షల మందికి 112 ఏళ్లు..
ఇక ఈ దేశంలో 112 ఏళ్ల వయసున్నవారు 65 లక్షల మంది సోషల్ సెక్యూరిటీ నంబర్లను కలిగి ఉన్నారు. కానీ, వారికి సంబంధించి ఎలాంటి డెత్ ఇన్‌ఫర్మేషన్ నమోదు చేయలేదు. వీరంతా ఎలక్ట్రానిక్ డెట్ ఇన్ఫర్మేషన్ నమోదు వ్యవస్థ రాకముందే ప్రాణాలు కోల్పోయారు. కేవలం 35 మంది మాత్రమే భూమిపై ఉన్నారు. జనాభా లెక్కల ప్రకారం.. అమెరికాలో 100 ఏళ్లు దాటిన వృద్ధులు 86 వేల మంది ఉంటారు. ఇక సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు చెందిన రిటైర్మెంట్, వైకల్యంతో బాధపడేవారికి సంబంధించిన ఆదాయ మార్గాలను సమకూర్చుకుంది.
ఆ 4.7 ట్రిలియన్ డాలర్లు ఎక్కడ..
ఇదిలా ఉంటే.. అమెరికాలో ట్రెజరీ డిపార్ట్‌మంట్ నుంచి చెల్లించిన 4.7 ట్రియన్ డార్ల(రూ.4 కోట్ల)కు, టాస్(ట్రెజరీ అకౌంట్ సింబర్) లేదని డోజ్ అధిపతి ఎలాన్ మస్క్ తెలిపారు. దీంతో ఆ నిధులు ఏమైయ్యాయో గుర్తించడం దాదాపు అసాధ్యమని తెలిపారు. కోడ్ వాడడం, ఇప్పటి వరకు ఆప్షనల్ అని వెల్లడించారు. కానీ, తాజాగా డోజ్ ఈ విషయాన్ని గుర్తించడంతో టాస్ కోడ్ వాడడం తప్పనిసరి చేసినట్లు మస్క్ ఎక్స్ వేదికగా వల్లడించారు. మస్క్‌కు ఇటీవలే ట్రెజరీ డిపార్ట్‌మంట్ సమాచారం చేసే యాక్సెస్ ఇచ్చింది. రెవెన్యూ శాఖలో పన్ను చెల్లింపులదారుల డేటా కూడా తమకు యాక్సెస్ ఇవ్వాలని కోరింది. ఇదే జరిగితే అమెరికాలో పన్ను చెల్లింపుదారులు, బ్యాంకులు, ఇతర సున్నితమైన డేటా మొత్తం డోజ్ చేతికి వస్తుంది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: There are over 2000 people over 200 years old in america
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com