Egg: గుడ్డును ఇలా తింటే ప్రమాదమే?

భారత్ లో గుడ్డు తినేవారు ఎక్కువ. తక్కువ ధరలో పోషకం ఉండే ఆహార పదార్థం గుడ్డు మాత్రమే. ఇందులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. కంటి చూపు మెరుగ్గా ఉండడానికి గుడ్డు తినాలి.

Written By: Chai Muchhata, Updated On : October 3, 2023 4:45 pm

Egg

Follow us on

Egg: శరీరం ఆరోగ్యంగా ఉండడానికి సాధారణ ఆహారం తింటే సరిపోదు. దీనికి తోడు ఇతర ప్రోటీన్లు, పోషకాలు ఉన్న కొన్ని పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అధిక పోషకాలు ఉండే వాటిని అప్పుడప్పుడు లేదా మోతాదులో తీసుకుంటూ ఉండాలి. వీటిలో గుడ్డు ప్రధానమైనది. పౌష్టికాహారంలో గుడ్డు ఒకటి. ప్రతిరోజూ గుడ్డు తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. గుడ్డు తినడం వల్ల తక్షణ ఎనర్జీ వస్తుంది. బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డు చేర్చితే రోజంతా ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యం కోసం గుడ్గు తినాలని కొందరు వైద్యులు ప్రత్యేకంగా చెబుతూ ఉంటారు. అయితే ఇలాంటి వారు గుడ్డు అస్సలు తినకూడదట. తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. ఇంతకీ గుడ్డు తినకూడని వారు ఎవరో తెలుసా?

భారత్ లో గుడ్డు తినేవారు ఎక్కువ. తక్కువ ధరలో పోషకం ఉండే ఆహార పదార్థం గుడ్డు మాత్రమే. ఇందులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. కంటి చూపు మెరుగ్గా ఉండడానికి గుడ్డు తినాలి. గుడ్డులో ఉండే అమైనో అమ్లాలు శరీరానికి ఎక్కువ శక్తిని ఇస్తాయి. గర్భిణులు కచ్చితంగా గుడ్డు తినాలని చెబుతూ ఉంటారు. ఉడికించిన గుడ్డులో సల్ఫర్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

అయితే కొందరు గుడ్డు తినడం వల్ల అనేక నష్టాలను ఎదుర్కొంటారు. గుండె సంబధిత వ్యాధులు ఉన్నవారు గుడ్డు తినకూడదు. గుడ్లు ఎక్కువగా తినడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. గుడ్డులో మాంసం కృతులు ఎక్కువగా ఉంటాయి. ఇది తినడం వల్ల ఎక్కువ కేలరీలు ఇస్తుంది. అందువల్ల కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న వారు గడ్డు తినకూడదు. ఎందుకంటే గుడ్డు తినడం వల్ల మరింత బరువు పెరిగి గుండెపోటు సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

గుడ్డు తినడం వల్ల శరీరంలో వేడిని పెంచుతుంది. అయితే జ్వరం వచ్చిన సమయంలో గుడ్డు తినకూడదు. ఇది తినడం వల్ల కాలేయంపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా జాండీస్ వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా కడుపులో అధిక వేడి తయారై కడుపునొప్పి వస్తుంది. కొందరు గుడ్డును ఆమ్లేట్ రూపంలో తింటుంటారు. మరికొందరు ఆమ్లేట్, బాయిల్డ్ ఎగ్ కలిపి తింటారు. ఇలా తినడం వల్ల శరీరంపై చెడు ప్రభావం పడుతుంది.