
Beer Benefits: మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెబుతూనే మద్యంతో వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్వహణకు ప్రధాన ఆదాయం మద్యం నుంచే వస్తుంది. దీంతో ఏ ప్రభుత్వం కూడా మద్యనిషేధం చేయడం లేదు. మద్య నిషేధం విధిస్తే ఆదాయానికి దారులు ఉండవు. అందుకే నిత్యం మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో అల్కాహాల్ ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారుతోంది. చెట్టు పేరు చెప్పి కాయలమ్మడం అంటే ఇదే. మద్యం బాటిళ్ల మీద మద్యపానం హానికరం అని లేబుల్ వేస్తూనే మందుబాబులతో తాగిస్తోంది. సాయంత్రం అయిందంటే చాలు వారు కిక్కెక్కితేనే ప్రభుత్వం పంట పండుతుంది. ఇలా మద్యపానం ద్వారా భారీగా ఆదాయం సమకూర్చుకుంటోంది.
చాలా మంది బీరు తాగితే చల్లగా ఉంటుంది ఫర్వాలేదు అనుకుంటారు. కానీ ఇందులో ఉండే అల్కాహాల్ తో మన శరీరమే గుల్లబారిపోతుందని తెలుసుకోరు. వంద ఎంఎల్ బీరులో 35 నుంచి 40 కిలో కేలరీల శక్తి వస్తుంది. బీరు తాగడం అందరికి అలవాటుగా మారుతోంది. బీరులో 5 శాతం అల్కహాల్ ఉంటుంది. బీరు తాగితే బరువు పెరగడానికి కారణంగా నిలుస్తుంది. బీరు తాగడం వల్ల మనకు ఎంతో ముప్పు ఉంటుందని తెలిసినా పట్టించుకోవడం లేదు. బీరు తాగుతూ ఊగుతున్నారు కానీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.
ఒక బీరు తాగడం వల్ల 200 కేలరీల శక్తి అందుతుంది. ఒకటి కంటే ఎక్కువ బీర్లు తాగుతూ అధిక కేలరీలు శరీరంలోకి వచ్చేందుకు కారకులవుతున్నారు. బీరు తాగడంతో అధికంగా మినరల్స్ కోల్పోతున్నారు. బీరు తీసుకోవడం వల్ల యూరిన్ ఎక్కువగా వస్తుంది. యూరిన్ లో విటమిన్స్, మినరల్స్ మూత్రపిండాలు గ్రహించుకుంటాయి. దీని వల్ల కూడా సమస్యలు వస్తాయి. ఇలా బీరు తాగడం వల్ల అనర్థాలున్నాయని తెలిసినా లెక్క చేయడం లేదు. అందుకే మద్యపానం వల్ల మనకు ఇబ్బందులు ఉంటాయని తెలుసుకుని దానికి దూరంగా ఉండటం మంచిది.

ఎముకల్లో ఉండే కాల్షియం రక్తంలో కలిసి క్షారత్వం సాధారణ స్థితికి చేరుతుంది. దీని వల్ల ఎముకలు గుల్లబారుతాయి. దీంతో బరువు పెరగడం వంటి సమస్యలు కూడా వస్తాయి. బీరు తాగడం వల్ల లివర్ కూడా చెడిపోతుంది. కాలేలయంలో వ్యర్థాలు బయటకు పంపించే ప్రక్రియ ఆగిపోతుంది. ఫ్యాటీ లివర్, ఊబకాయం, బాణ పొట్ట వంటి సమస్యలు వస్తాయి. ఈ క్రమంలో బీరు తాగడాన్ని మానేస్తేనే మన ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.