
Alcohol : ఇటీవల కొందరు చెప్పే విషయాలు నమ్మశక్యంగా ఉండటం లేదు. కొందరేమో మద్యపానం హానికరం అంటారు. ఇంకా కొందరేమో మితంగా తీసుకుంటే ఏం కాదని సెలవిస్తుంటారు. ఇందులో ఏది నిజం? ఏది అబద్ధం. ప్రజలు దేన్ని ఆచరించాలి. మద్యం తాగితే ఆరోగ్యం చెడిపోదు అని చెబుతుంటే ఇక ఏం చేస్తారు. విచ్చలవిడిగా తాగుతారు. ఇప్పటికే మద్యంప్రియుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఇలాంటి ప్రకటనలు ఇస్తే ప్రజలు తప్పుదారి పట్టే అవకాశం ఉంది. వీలైతే మంచి చేయండి కానీ కీడు చేయొద్దు. మంచి మార్గంలో ఉన్న వారిని చెడు మార్గంలోకి నడిపించొద్దు.
బీరు గురించి ఇక్కడో విషయం చెప్పాలి. రోజుకు 350 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ బీరు తాగకూడదని చెబుతున్నారు. కానీ అంత తక్కువ ఎవరైనా తాగుతారా? బరిలో దిగితే చెప్పిన మాట వింటారా? ఇదేమైనా ఆచరణ యోగ్యంగా ఉందా? ప్రజలు చెడిపోవడానికి ఇలాంటి ప్రకటనలే ఊతం ఇస్తున్నాయి. వారి జీవితాలను గుళ్ల చేస్తున్నాయి. మద్యానికి అలవాటు పడేది మధ్యతరగతి ప్రజలే. ధనవంతులు ఎక్కువగా మద్యం తాగరు. కూలి చేసుకునే వారే మద్యానికి బానిసలుగా ఉండటం కామనే.

ఈ నేపథ్యంలో మద్యం తాగడం మంచిదే అని చెప్పడం దేనికి. అల్కహాల్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని చెప్పేది పోయి రోజు కొంత తీసుకుంటే ఎలాంటి నష్టం లేదని అంటే ప్రజలను పక్కదారి పట్టించడానికే కదా. ఇప్పటికే సరదాల పేరుతో మద్యం ఏరులై పారుతుంటే ఇంకా ఇలాంటి చౌకబారు ప్రకటనలు చేయడం సమంజసం కాదు. బీరుపై పరిశోధనలు చేశామని చెప్పి వారిని మద్యం మత్తులో ముంచేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఈ పరిశోధనలు అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.
ఒక బీరు తాగే ఉండాలంటే ఉంటారా? తాగుడు మొదలెట్టాక అది ఎక్కడ ఆగుతుందో తెలియదు. ఒక్కొక్కరు డజన్ బీర్లు తాగేవారు కూడా ఉంటారు. ఇలా మద్యానికి ప్రజలను బానిసలుగా చేస్తున్నారు. తద్వారా ఆదాయాన్ని నింపుకుంటున్నారు. ప్రజా జీవితాన్ని కకావికలం చేస్తున్నారు. మద్యం మత్తులో పడి కొట్టుకునేలా మారుస్తున్నారు. వీలైతే మద్యం మానేయాలని చెప్పాలి. కానీ మద్యం తాగితే ఆరోగ్యానికి మంచిదని చెప్పడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. చెట్టు పేరు చెప్పి కాయలమ్మినట్లుగా ఉంది.