Homeలైఫ్ స్టైల్Cockroach Milk : ఏంటి రోజూ తాగే గేదె పాలకంటే బొద్దింక పాలు మంచివా.. నిజమెంత...

Cockroach Milk : ఏంటి రోజూ తాగే గేదె పాలకంటే బొద్దింక పాలు మంచివా.. నిజమెంత ?

Cockroach Milk : మనం ప్రతి రోజు ఆవు, గేదె పాలు తాగుతూనే ఉంటాం. ఏదైనా అనారోగ్యం అనిపిస్తే గాడిద పాలు తాగితే మంచిది అంటారు. కానీ ఎప్పుడైనా బొద్దింక పాలు తాగతారని విన్నారా ? పరిశోధనల ప్రకారం బొద్దింకల పాలలో ఆవు, గేదె పాలకంటే అనేక రెట్లు ఎక్కువ పోషకాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వాస్తవానికి గత కొన్నేళ్లుగా మన ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయి. సూపర్ ఫుడ్స్ అనే పదం ఇటీవల కాలంలో జోరుగా వినిపిస్తోంది. వాస్తవంగా చెప్పాలంటే అసలు సూపర్ ఫుడ్స్ అనేవే లేవనేది డాక్టర్లు అంటున్నారు. మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా న్యూటిషన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఇవేనంటూ కంపెనీలు గొప్పలు చెప్పటమే తప్పితే వాస్తవానికి అలాంటివేమీ ఉండవని చెబుతున్నారు. ఈ మధ్య ఇలానే బాగా ప్రచారం జరుగుతున్న ఒక సూపర్ ఫుడ్స్లో ఒకటి బొద్దింక పాలు. బొద్దింక పాలల్లో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయని, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నెట్టింట్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. అసలు ఈ బొద్దింక పాలల్లో నిజంగానే పోషక విలువలు ఉన్నాయా లేక ఇదంతా ఫేక్ ప్రచారమేనా.. వాస్తవేంటో తెలుసుకుందాం. పాల రూపంలో వచ్చే ఈ ప్రత్యేకమైన స్ఫటిక ప్రోటీన్ మన బాడీకి అవసరమైన అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలను అందజేస్తుందట. అంతేకాదు ఆరోగ్యకరమైన కొవ్వులు, చక్కెరలు కూడా ఇందులో లభిస్తాయి.

బొద్దింక పాలలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డిప్లోప్టెరా పంక్టాటా అనే బొద్దింక రకం పాలు మనుషులకు చాలా మేలు చేస్తాయని వెల్లడైంది. అయితే ఈ బొద్దింక రకం అరుదుగా ఉంటుంది. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్స్, కొవ్వు ఈ బొద్దింక పాలలో ఎక్కువగా ఉంటాయని తేలింది. మానవ శరీరానికి అవసరమైన తొమ్మిది రకాల అమైనో యాసిడ్స్ ఈ బొద్దింక పాలలో ఉన్నట్లు నిపుణులు కనుగొన్నారు. మాంసకృత్తుల్లో మాత్రమే ఈ తొమ్మిది రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. అవి కాకుండా బొద్దింక పాలల్లో మాత్రమే ఇవి మొత్తం ఉన్నాయని తేలింది. అందువల్ల.. డిప్లోప్టెరా పంక్టాటా బొద్దింక పాలను ప్రొటీన్లు ఇచ్చే నాన్-డైరీ మిల్క్గా పరిగణిస్తున్నారు. అయితే.. పాల కోసం బొద్దింకలను చంపుకుంటూ పోయే ప్రమాదం లేకపోలేదు. 1,000 బొద్దింకల నుంచి 100 గ్రాముల పాలను మాత్రమే సేకరించగలమని ఈ బొద్దింక పాలపై పరిశోధన చేసిన నిపుణులు తెలిపారు. ఆవు పాల కంటే బొద్దింక పాలలో మూడు రెట్లు పోషక విలువలున్నాయని ల్యాబ్ రీసెర్చ్లో వెల్లడైంది.

శాస్త్రవేత్తలు జరిపిన ప్రయోగాలలో 100 గ్రాముల బొద్దింక పాలు శరీరానికి 232 కేలరీల శక్తిని అందిస్తాయని తేలింది. అయితే అదే పరిమాణంలోని ఆవు పాలు కేవలం 66 కేలరీల శక్తినే అందిస్తాయి. బొద్దింక పాలలో 45శాతం మేర ప్రోటీన్, 25శాతం కార్బోహైడ్రేట్లు, 16-22శాతం కొవ్వు, 5శాతం అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయని పరిశోధకులు కనుగొన్నారు. ఈ విషయాన్ని “ఫ్రీ ప్రెస్ జర్నల్’లో ప్రచురించారు. అలాగే బొద్దింక పాలలో ఒలేయిక్ ఆమ్లం, లినోలెయిక్ ఆమ్లం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, షార్ట్-చైన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి అత్యవసరమైన ప్రోటీన్‌గా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక చాలా మంది పాలు జీర్ణకాక ఇబ్బంది పడుతుంటారు. లాక్టోస్‌ను జీర్ణం చేసే లాక్టేజ్ ఎంజైమ్ ప్రపంచ జనాభాలో సుమారు 65శాతం మందిలో తక్కువగా ఉండడంతో వారికి పాలు తాగితే ఉబ్బరం, అజీర్ణం, వికారం, విరేచనాలు లాంటి సమస్యలు వస్తాయి. అయితే బొద్దింక పాలలో లాక్టోస్ ఉండదు. అందువల్ల ఇది లాక్టోస్ సమస్య ఉన్నవారికి ఓ మంచి ప్రత్యామ్నాయంగా మారొచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే బొద్దింకల నుంచి పాలు సేకరించడం అంత తేలికైన పని కాదు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular