IRCTC Ticket Booking: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది రైల్వే శాఖ. ప్రస్తుతం శ్రావణమాసం ( Shravana masam ) కావడంతో శుభకార్యాల సందడి కనిపిస్తోంది. వివాహ వేడుకలతో పాటు ఇతర శుభకార్యాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాల్లో వివాహాలు చేసుకునేవారు తమ స్వస్థలం, స్వగ్రామాల్లో బంధువులు, కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో బస్సులు, ప్రైవేటు వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే మెట్రో నగరాల్లో చాలామంది గ్రామీణ ప్రాంతాల వారు స్థిరపడి ఉంటారు. అటువంటి వారి ఇళ్లల్లో శుభకార్యాలు జరిగినప్పుడు స్వస్థలాల నుంచి వచ్చే వారు అసౌకర్యానికి గురవుతుంటారు. అయితే ఎక్కువ దూరం వాహన ప్రయాణం సురక్షితం కాదు. అందుకే అటువంటి వారి కోసం ఇండియన్ రైల్వే శాఖ వినూత్న ఆలోచన చేసింది. రైలు భోగితో పాటు రైలు మొత్తం బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది రైల్వే శాఖ. చాలా తక్కువ ఖర్చుతో ఈ సదుపాయం పొందవచ్చు కూడా.
ముందుగా డిపాజిట్
వివాహ శుభకార్యాలకు రైలు బోగీలను బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా ఈజీ. FTR IRCTC ద్వారా చాలా సులువుగా రైలు బోగీలను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఒకటి లేదా రెండు బోగీలను బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే మరి అవసరం అనుకుంటే రైలులోని అన్ని బోగీలను కూడా బుక్ చేసుకునే అవకాశం కల్పించింది రైల్వే శాఖ( railway department). కనీసం 18 బోగీలు, గరిష్టంగా 24 భోగిలను బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఒక్కో బోగీకి కొంత డబ్బు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ప్రయాణించే దూరం, బోగీల సంఖ్యను బట్టి రైల్వే శాఖ ధర నిర్ణయిస్తుంది. ఒక్కో బోగీకి 50 వేల రూపాయల చొప్పున డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తొమ్మిది లక్షల రూపాయలతో 18 బోగీలను బుక్ చేసుకోవచ్చు. రైలు బుక్ చేసుకున్నప్పుడు.. అందులో ప్రయాణించే వారి డబ్బును లెక్కిస్తారు. ఆ డబ్బును తీసివేసి మిగిలిన డబ్బును పది రోజుల్లో తిరిగి చెల్లిస్తారు. ఒకటి రెండు బోగీలలో ప్రయాణిస్తే ఆ డబ్బును ఉంచుకొని డిపాజిట్ డబ్బులు తిరిగి ఇస్తారు.
Also Read: ఏపీలో ఆ మహిళలకు ఉచితంగా రూ.11 వేలు
ఇలా చేయాలి..
IRCTC ద్వారా బోగీలను బుక్ చేసుకోవడం చాలా ఈజీ అంటున్నారు రైల్వే శాఖ అధికారులు. గూగుల్లో ftr IRCTC అని టైప్ చేస్తే వెబ్సైట్ వస్తుంది. అందులో ముందుగా రిజిస్టర్ కావాలి. ఆ తరువాత బుకింగ్స్ కు వెళ్లి.. బోగీ కావాలా? రైలు కావాలా? అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ రైలులోని బోగీలు మొత్తం బుక్ చేసుకోవాలనుకుంటే కనీసం 18 నుంచి 24 వరకు ఎంపిక చేసుకోవాల్సిందే. అందులోనూ కోచ్ టైపును కూడా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ స్లీపర్, త్రీ టైర్ ఏసి, టూ టైర్ ఏసి, ఫస్ట్ క్లాస్ ఏసి ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఏ స్టేషన్ లో ఎక్కి ఏ స్టేషన్లో దిగుతారో కూడా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. నెల రోజులు ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించిన కేవలం వారం రోజుల్లోనే మనకు కన్ఫర్మ్ చేస్తారు. ఈ బుకింగ్ ఆన్లైన్లో చేసుకోవచ్చు.. ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు.