Rajinikanth Dream: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ దక్కనటువంటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు రజనీకాంత్… మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆయన ఇప్పటికి హీరోగా సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన స్పందనను రాబడుతున్నాడు. రీసెంట్ గా కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాడు…ఇక ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా కూడా రజనీకాంత్ స్టైల్ అద్భుతంగా ఉందని వింటేజ్ రజినీకాంత్ ని చూశాం అంటూ అతని అభిమానులు ఆనంద పడుతున్నారు. మరి ఇదిలా ఉంటే 74 సంవత్సరాల వయసులో కూడా ఆయన భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను చేస్తూ ఇప్పుడున్న యంగ్ హీరోలకు పోటీని ఇస్తున్నాడు అంటే మామూలు విషయం కాదు. అయితే రజనీకాంత్ కెరీర్ లో ఒక్కసారైనా 1000 కోట్ల వసూళ్లను సాధించాలనే లక్ష్యంతో రజనీకాంత్ అయితే ఉన్నాడు. ఇక కూలీ సినిమాతో అది సాధ్యమవుతుంది అనుకున్నప్పటికి సినిమా ఆశించిన మేరకు ప్రేక్షకుడిని ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమా కూడా 1000 కోట్ల మార్కును అందుకోలేకపోతుందనే చెప్పాలి. మరి రజినీకాంత్ గత కొన్ని రోజులుగా పెట్టుకున్న కల కలగానే మిగిలిపోతుందా?
లేదంటే ‘జైలర్ 2′ సినిమాతో 1000 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొడతాడా? లేదా అనేది కూడా ఇప్పుడు తెలియాల్సింది.’రోబో 2’ సినిమా 600 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టిన రజనీకాంత్ ఇప్పుడు 1000 కోట్ల టార్గెట్ ను పెట్టుకోవడానికి గల కారణం ఏంటి అంటే పాన్ ఇండియాలో కొంతమంది యంగ్ హీరోలు మంచి సినిమాలను చేస్తూ 100 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొడుతున్నారు.
Also Read: విశ్వంభర పైనే ‘చిరు’ ఆశలు.. ఏమవుతుందో ఏమో..?
ఇక దాంతో రజినీకాంత్ సైతం వాళ్లకంటే తనేమీ తక్కువ కాదని తనకున్న ఇమేజ్ చాలా పెద్దదని తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. మరి అతను అనుకున్నట్టుగానే రాబోయే సినిమాలతో 1000 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంటాడా?తన స్టార్ డమ్ ను మరింత విస్తరింప చేసుకుంటాడా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…
ఇక కూలీ సినిమా విషయంలో అతను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటికి లోకేష్ కనకరాజు డిఫరెంట్ మేకింగ్ తో మంచి సినిమాలు చేస్తాడని అందరు అనుకున్నారు. కానీ ఈ సినిమాతో చాలావరకు ఆయన రజనీకాంత్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులను సైతం నిరుత్సాహపరచాడనే చెప్పాలి…