
IPL Umpires Salaries: క్రికెట్ ప్లేయర్స్ కు కోట్లు కురిపించే లీగ్ ఐపీఎల్. ఇందులో ఆడే ఆటగాళ్లకు కోట్లాది రూపాయలు వేతనాలు రూపంలో వస్తుంటాయి. ప్రతి మ్యాచ్లో క్రీడాకారులతో పాటు అంతే కీలకంగా ఉండే అంపైర్ల కు మేనేజ్మెంట్ ఎంత ఇస్తుందో తెలుసా. ఆ వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే.
మరో పది రోజుల్లో ఐపీఎల్ ఆరంభం కాబోతోంది. 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం సర్వం సిద్ధమయ్యాయి. మరోసారి మండే ఎండల్లో అభిమానులను అలరించేందుకు క్రికెటర్లు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడే క్రికెటర్ల పారితోష్కారాలు కూడా భారీగానే పెరిగాయి. దీంతోపాటు ఈ సీజన్లో అబ్బాయిలకు ఇచ్చే వేతనాలు, భత్యాల మొత్తం భారీగా పెరిగింది. ప్రతి ఐపీఎల్ లో ఆటగాళ్ల పాత్ర ఎంత విలువైనదో అంపైర్ల పాత్ర కూడా అంతే కీలకం. అందుకే క్రికెటర్లతో పాటు అంపైర్లు పోషిస్తున్న పాత్ర మేరకు వాళ్లకు ఇచ్చే వేతనాలు భయాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ప్రతి సీజన్లోనూ ఈ మొత్తాలు పెరుగుతుండగా.. ఈసారి కూడా పెంచాలని ఐపిఎల్ యాజమాన్యం నిర్ణయించింది. గత సీజన్లో ఉన్న మతాల కంటే ఈసారి మరింత ఎక్కువగా వేతనాలు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతోపాటు స్పాన్సర్షిప్పులు ద్వారా వారు పొందే ఆదాయం దీనికి అదనం.
రెండు ప్యానల్లో అంపైర్లు..
ఐపీఎల్ అంపైర్లు రెండు గ్రేడ్లలో ఎలైట్ ప్యానల్, డెవలప్మెంట్ అంపైర్లు ఉంటారు. ఎలైట్ ప్యానెల్ అంపైర్లు ఐపీఎల్లో అత్యంత ఉన్నత స్థాయి మ్యాచ్లను నిర్వహించడానికి బాధ్యత వహించే టాప్ ర్యాంకు అధికారులుగా పరిగణిస్తుంటారు. మరోవైపు కొత్తవారు, ఎక్కువ అనుభవం లేని వారిని డెవలప్మెంట్ అంపైర్లుగా నియమిస్తారు. వీరికి భవిష్యత్తులో ఎలైట్ ప్యానెల్ అంపైర్లుగా మారేందుకు శిక్షణగా ఇది ఉపయోగపడుతుంది.

ఇవీ వేతనాలు..
రెండు గ్రేడ్లలో అంపైర్ల వేతనాలను ఒకసారి గమనిస్తే .. ఎలైట్ ప్యానల్ అంపైర్లు ప్రాథమిక వేతనం లక్షా 98 వేలుగా ఈసారి నిర్ణయించారు. గత సీజన్లో వీరికి లక్ష 75 వేల రూపాయలు బేసిక్ వేతనంగా ఇచ్చారు. ఈసారి ఇది 23 వేల రూపాయలు పెరిగింది. దీంతోపాటు ఎలైట్ ప్యానెల్ అంపైర్లు వారు నిర్వహించే ప్రతి మ్యాచ్ కు రోజువారి భత్యం రూ.12,500 అందుకుంటారు. ఇందులో వారి ప్రయాణ, వసతి ఖర్చులు కూడా ఉంటాయి. ఎలైట్ ప్యానెల్ అంపైర్లు ఐపీఎల్ అన్ని మ్యాచ్ ల్లో అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తే 40 లక్షల వరకు సంపాదించుకునేందుకు వీలుంటుంది.
40 వేల నుంచి 59 వేలకు..
ఇక ఐపీఎల్ సీజన్ లో అంపైరింగ్ చేసే రెండో గ్రేడ్ అంపైర్లకు వేతనం భారీగానే పెరిగింది. ఈ సీజన్లో డెవలప్మెంట్ అంపైర్లు కు బేసిక్ పే గా రూ.59,000 ఇవ్వనున్నారు. గత సీజన్లో డెవలప్మెంట్ అంపైర్లకు రూ.40 వేలు మాత్రమే ఇచ్చారు. దీంతో గతేడాదితో పోలిస్తే ఈసారి ఏకంగా రూ.19 వేలు రూపాయలు బేసిక్ పే రూపంలోనే పెరిగింది. డెవలప్మెంట్ అంపైర్లు ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్లో విధులు నిర్వర్తించే అవకాశం రాదు కాబట్టి వారికి రోజువారి భత్యం ఇవ్వరు. అయినాప్పటికీ వారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, భవిష్యత్తులో ప్రమోషన్ల కోసం వారిని సిద్ధం చేయడానికి ఎలైట్ ప్యానెల్ అంపైర్ల నుంచి శిక్షణా మార్గదర్శకత్వం లభిస్తుంది.