
Hema: ‘సినీ సెలబ్రెటీలు అయినంత మాత్రాన వారిని బజారుకీడ్చాలా? వారికి ఫ్యామిలీస్ ఉండవా? అడ్డదిడ్డంగా.. అసభ్యకరంగా వారి గురించి తప్పుడు ప్రచారం చేస్తే వారు ఎంత ఇబ్బంది పడుతారో మీరు చూస్తున్నారా? ఇటీవల కోట శ్రీనివాసరావు గారు మరణించారని పోస్టుల పెట్టారు.. నేను బతికే ఉన్నానని వీడియో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పోస్టులు పెట్టే వాళ్లతో సమాజం చెడిపోతుంది.’ అంటూ నటి హేమ ఫైర్ అయ్యారు. ఇటీవల తన గురించి కొందరు సోషల్ మీడియాలో చేసిన ప్రచారంపై ఆమె భగ్గుమన్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన హేమ ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. అసభ్యకర పోస్టులు పెట్టేవారి అంతు చూసేవరకు నిద్రపోనని హేమ వార్నింగ్ ఇచ్చారు.
సీనియర్ నటి హేమ సోషల్ మీడియాపై ఫైర్ అయ్యారు. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను ఓ చిన్నప్పుడు ఓ పార్టీలో ఉన్నప్పుటి ఫొటోలను మార్ఫింగ్ చేసి నెట్టింట్లో పెట్టారని, వీటిని ఇప్పటి వరకు నా భర్త చూడలేదని చూస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తనవే కాకుండా సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ఫొటోలు మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా తయారు చేస్తూ రిలీజ్ చేస్తున్నారనన్నారు. దీంతో వారు మానసికంగా కుంగిపోతున్నారన్నారు. కొందరు నటీమణలు తమ భర్తలతో కలిసి ఉన్నా విడాకులు తీసుకున్నట్లు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
వెబ్ మీడియాపై పోరాటం కొనసాగిస్తానని హేమ చెప్పుకొచ్చారు. గతంలో ఒకరు యూట్యూబ్ లో తన గురించి పోస్టులు పెడితే కోర్టులో కేసు పెట్టానన్నారు. అమెరికాలో ఉన్న ఆ యూట్యూబర్ ను పోలీసులు పట్టుకొచ్చి కోర్టులు హాజరు పరిచారని అన్నారు. ఇంకనూ ఇలాంటి పోస్టులు పెట్టే వారిపై పోరాటం చేస్తాను. ఎన్ని రోజులైనా ఇలాంటి కేసుల్లో కోర్టుకు వచ్చేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే కొన్ని పోస్టులపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

యూట్యూబ్ లల్లో పోస్టు పెట్టేవారు ఎక్కడ ఉంటారో తెలియదు. వారికి నీతి, నియమాలు ఉండవు. ఒకరు అసభ్యకరంగా పోస్టు పెడితే వారిని అనుసరిస్తూ మరికొందరు అవే పోస్టులు పెడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇక నుంచి ఎవరి గురించైనా, ఎవరి ఫ్యామిలీ గురించైనా అసభ్యకరంగా పోస్టులు పెడితే అస్సలు ఊరుకునేది లేదని హేమ హెచ్చరించారు. వాళ్ల అంతు చూసేదాకా నిద్రపోనని అన్నారు. ఇలాంటి వాళ్లపై నాకు సపోర్టు లేకున్నా పోరాటం సాగిస్తాను. ఎంతవరకైనా వెళ్తాను అని హేమ ఆగ్రహంతో ఊగిపోయారు.