Harry Brook- IPL Auction 2023: ఐపీఎల్ సమరానికి సన్నద్ధమవుతున్నారు. మ్యాచ్ ల నిర్వహణకు గాను ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఆటగాళ్ల రేటు పెరిగిపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సన్ రైజర్స్ ఐపీఎల్ మినీ వేలంలో ఇంగ్లండ్ యువ ప్లేయర్ హరీ బ్రూక్ ను రూ.13.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేయడం సంచలనం కలిగించింది. హరీ బ్రూక్ కోసం సన్ రైజర్స్ అంత భారీ మొత్తం చెల్లించడంపై విమర్శలు ఎదుర్కొంటోంది. గతంలో కూడా సన్ రైజర్స్ పలు విషయాల్లో విమర్శలు వెల్లువెత్తాయి.

ఐపీఎల్ లో అనుభవం లేని బ్రూక్ ను తీసుకోవడంపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బ్రూక్ కోసం రాజస్థాన్ రాయల్స్ పోటీ పడటంతో అతడి ధర అమాంతం పెరిగిపోయింది. కేవలం టీ20 ప్రపంచ కప్ లో ఆడిన అనుభవం ఉన్న అతడిని ఇంత భారీ ధర వెచ్చించడంపై అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత పిచ్ లపై అనుభవం లేని బ్రూక్ కోసం ఇంత మొత్తంలో ఖర్చు చేయడం వెనుక ఆంతర్యమేమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. బ్రూక్ కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని పిచ్చి పనిగానే అభివర్ణిస్తున్నారు.
సన్ రైజర్స్ కు ఎయిడెన్ మార్క్ రమ్, గ్లేన్ ఫిలిప్స్ వంటి మిడిలార్డర్లు ఉన్నా బ్రూక్ ను కొనుగోలు చేయడంలో ఏ స్ట్రాటజీ ప్రకారం తీసుకున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. సన్ రైజర్స్ హెడ్ కోచ్ బ్రియాన్ లారా బ్రూక్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చారు. హరీ బ్రూక్, మయాంక్ అగర్వాల్ లను కొనుగోలు చేయడంపై లారా వివరణ ఇచ్చారు. బ్యాటింగ్ ను బలోపేతం చేసేందుకే వీరిని తీసుకున్నామని చెబుతున్నారు. ఇన్నాళ్లు బ్యాటింగ్ వైఫల్యమే దెబ్బతీస్తున్న నేపథ్యంలో దాన్ని అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు లారా పేర్కొనడం గమనార్హం.

ఐపీఎల్ లో పాకిస్తాన్ తో జరిగిన టెస్టులో హరీబ్రూక్ అదరగొట్టడంతో అతడిని తీసుకున్నాం. బ్రూక్ తో జట్టు పటిష్టం అవుతుందని ఆశిస్తున్నారు. మయాంక్ అగర్వాల్ కు రూ.8.25 కోట్లు పెట్టి కొనుగోలు చేశాం. ఇద్దరు ఆటగాళ్ల కోసమే రూ.21 కోట్లు ఖర్చు చేయడం వెనుక దాగున్న ఆంతర్యం ఇదేనని తన మనసులో మాట బయట పెట్టారు. మొత్తానికి సన్ రైజర్స్ పటిష్టం అయి మంచి పొజిషన్ తెచ్చుకుంటుందో లేక డీలా పడుతుందోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.