Homeబిజినెస్Adani Group- LIC: ఆదానీ గ్రూపులో పెట్టుబడులు: ఎల్ఐసి కి మంచి రోజులు

Adani Group- LIC: ఆదానీ గ్రూపులో పెట్టుబడులు: ఎల్ఐసి కి మంచి రోజులు

Adani Group- LIC: ” అదానీ గ్రూప్ కోసం ప్రధానమంత్రి ఎల్ఐసి ని పణంగా పెట్టారు. లక్షలాదిమంది దేశ ప్రజలు దాచుకున్న బీమా సొమ్మును గౌతమ్ అదానీకి ధారాదత్తం చేశారు.” ఇవీ అదాని కంపెనీ మీద ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు. ఇప్పుడు ఈ ఆరోపణలను అవి వెనక్కి తీసుకోవాల్సి ఉంటుందేమో.. ఎందుకంటే గౌతమ్ అదా నీ గ్రూపులో పెట్టుబడులు పెట్టిన ప్రభుత్వ రంగ భీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ విలువ పుంజుకుంది. డైవర్సిఫైడ్ దిగ్గజం ఆదాని గ్రూపునకు చెందిన ఏడు స్టాక్స్ లో ఎల్ఐసి విలువ తాజాగా 44,670 కోట్లను తాకింది. ఏప్రిల్ నుంచి చూస్తే 5500 కోట్ల విలువ దీనికి జత కలిసింది. అయితే అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ ఆరోపణ నివేదిక తదుపరి పతన బాట పట్టిన ఆదాని గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు కొద్దిరోజులుగా జోరు చూపుతుండడం మారిన పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఆ దాఖలాలు లేవు

ఇక ఇటీవల సుప్రీంకోర్టు నియమిత నిపుణుల కమిటీ గ్రూప్ షేర్ల ధరలను కృత్రిమంగా పెంచిన దాఖలాలు లేవంటూ స్పష్టం చేసింది. ఇది గౌతమ్ అదాని గ్రూపులకు చాలా మంచి చేసింది. దీంతో ఇన్వెస్టర్లు అదానికి షేర్లల్లో కొనుగోళ్లకు ఆసక్తి చెబుతున్నారు. ఫలితంగా గత మూడు రోజుల్లో 10 కంపెనీలతో కూడిన ఆదాని గ్రూప్ మార్కెట్ విలువ 1,77, 927 కోట్ల మేర పెరిగింది. చివరికి 10,79,498 కోట్లకు చేరింది. ఇక ఆదాని పోర్ట్స్ అండ్ సెజ్ లో ఎల్ఐసి కి అత్యధికంగా 9.12 శాతం వాటా ఉంది. బుధవారం షేర్ ధర 718 తో పోలిస్తే వీటి విలువ 14,145 కోట్లకు చేరింది. ఇక ఆదాని ఎంటర్ప్రైజెస్ లో గల 4.2% వాటా విలువ 12,017 కోట్లకు చేరింది. షేర్ ధర 2,477 వద్ద ముగిసింది. ఇక ఎల్ఐసి కి ఆదాని టోటల్ గ్యాస్, అంబుజా సిమెంట్ తో కలిపి 10,500 కోట్ల విలువైన పెట్టుబడులు ఉన్నాయి. ఈ బాటలో ఆదాని ట్రాన్స్మిషన్, ఆదాని గ్రీన్ ఎనర్జీ, ఏసీసీలలోనూ ఎల్ఐసి వాటాలు కలిగి ఉంది. అదాని గ్రూప్ స్టాక్స్ లో రూ. 30,127 కోట్లు చేసినట్టు ఈ ఏడాది జనవరి 30న ఎల్ఐసి వెల్లడించింది. అయితే జనవరి 27 కల్లా ఈ పెట్టుబడులు 56 వేల 142 కోట్లకు చేరినట్టు తెలియజేసింది. అయితే తదుపరి హిండెన్ బర్గ్ నివేదిక సంచలన విషయాలు వెల్లడించడంతో అదా నీ స్టాక్స్ పతనం బాట పట్టాయి. దీంతో ఫిబ్రవరి 23 కల్లా ఎల్ఐసి పెట్టుబడుల విలువ 27 వేల కోట్లకు పడిపోయింది.

2023 మార్చి చివరికల్లా ఎల్ఐసి కి అదాని పోర్ట్స్ లో 9.12 శాతం, అదానీ ఎంటర్ప్రైజెస్ లో4.26 శాతం, ఎసిసిలో 6.41 శాతం, అంబుజా సిమెంట్స్ లో 6.3%, ఆదాని టోటల్ గ్యాస్ లో 6.2%, ఆదాని ట్రాన్స్మిషన్లో 3.68%, అతని గ్రీన్ ఎనర్జీలో 1.36 శాతం వాటాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆదాని గ్రూప్ షేర్ల విలువ పెరుగుతున్న నేపథ్యంలో.. ఎల్ఐసి కూడా తాను పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ ఆర్జించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సుప్రీంకోర్టు నియమించిన స్వతంత్ర దర్యాప్తు కమిటీ ఆదాని గ్రూప్ లో షేర్ల విలువ పెరుగుదల వెనుక ఎటువంటి కుట్ర కోణం లేదని తెలిపిన నేపథ్యంలో..ఆ గ్రూప్ షేర్లు మరింత వేగంగా దౌడు తీసే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఇక గురువారం కూడా ప్రధాని గ్రూప్ షేర్లు లాభాల బాటలో నడవడం విశేషం.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version