Post Office Schemes: డబ్బు సంపాదించడం కోసం అందరం కష్టపడుతుంటాం. అయితే చాలా మంది రిస్క్‌లేని జాబ్ కోసం, లేదా వ్యాపారం కోసం చూస్తూ ఉంటారు. కానీ, రిస్క్ లేకుండా ఎలాంటి ఆదాయం రాదు. కొందరికి ఒకరికింద పనిచేయడం నచ్చదు. వాళ్లు వ్యాపారంపై దృష్టిపెడతారు. అయితే వ్యాపారం కూడా అంత ఈజీ కాదు. పెట్టుబడికి డబ్బులు కావాలి. తర్వాత వ్యాపారం సజావుగా సాగాలి. ఫెయిల్ అయితే పెట్టుబడి కూడా పోతుంది. కానీ, తక్కువ పెట్టుబడితో జీవితాంతం ఆదాయం పొందే ఒక వ్యాపారం వచ్చింది. అదేంటో తెలుసుకుందాం.
రూ.10 వేలతో..
కేవలం పదివేల రూపాయలు డిపాజిట్ చేయడం ద్వారా జీవితాంతం ఆదాయం వస్తుంది. ఆ బిజినెస్ పేరు పోస్ట్ ఆఫీస్ ప్రాంచైజ్ స్కీం. ఈ స్కీం 2024, ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభించబడుతుంది. ఈ వ్యాపారం ఉద్దేశం ప్రజలకు ఎక్కువగా పోస్టాఫీస్ సేవలు అందించడమే. దీనికి పెద్దగా అర్హతలు కూడా అవసరం లేదు. పదో తరగతి ఉత్తీర్ణులై స్థానిక భాష మాట్లాడగలిగితే చాలు. కంప్యూటర్, స్మార్ట్ ఫోన్‌పై మాత్రం మంచి పరిజ్ఞానం తప్పనిసరి. ఈ అర్మతలు ఉంటే పోస్టాఫీస్ ఫ్రాంచైజ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
పాన్ కార్డు తప్పనిసరి..
ఇక ఇదిలా ఉంటే.. పోస్టాఫీస్ ఫ్రాంచైజ్‌కు దరఖాస్తు చేసుకునేవారు తప్పకుండా పాన్ కార్డు కలిగి ఉండాలి. మీ ప్రాంతంలోని పెద్ద పోస్టాఫీస్‌ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత రూ.10 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అన్ని అర్హతలు ఉంటే హెడ్ పోస్టాఫీస్ వారు ప్రాంచైజ్ ఇచ్చేస్తారు.
ఆదాయం ఇలా..
ఇక ఆదాయం ఎలా వస్తుందంటే.. పోస్టాఫీస్‌లో అందించే సేవలన్నీ మీ గ్రామంలోని లేదా పట్టణంలోని ప్రజలకు ఈ ఫ్రాంచైజ్ ద్వారా అందించవచ్చు లేఖలపై రూ.2, మని ఆర్డర్‌పై రూ.5 వరకు కమీషన్ వస్తుంది. పోస్టల్ స్టాంపులు, స్టేషనరీ అమ్మకాలపనై 5 శాతం కమీషన్ వస్తుంది. స్పీడ్ పోస్టులపై 7 శాతం నుంచి 25 శాతం వరకు లాభం పొందుతారు.