Shivaji: తెలుగు సినిమా ఇండస్ట్రీకి మొదట సైడ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత హీరోగా మారి, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి, ఇప్పుడు విలన్ గా చేస్తూ తన లక్కు ను పరీక్షించుకోవడానికి శివాజీ రెడీ అవుతున్నాడు.ఇక రీసెంట్ గా బిగ్ బాస్ షో ద్వారా భారీ పాపులారిటి ని సంపాదించుకున్న శివాజీ ఇక ఓటిటిలో చేసిన #90 అనే సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు.
ఇక దాంతో ఒక్కసారిగా శివాజీ మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చేసాడు.ఇక ఆయనకి ఇప్పుడు ఒక పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ లో నటించి మెప్పించాలని ఉంది అంటూ ఒక ఇంటర్వ్యూ లో తెలియజేశాడు. ఇక దానికి సంబంధించినట్టుగానే ఒక స్టార్ హీరో సినిమాలో శివాజీ విలన్ గా నటించబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో చాలా వార్తలైతే వస్తున్నాయి.
ఇక అసలు మ్యాటర్ ఏంటంటే బోయపాటితో బాలయ్య బాబు చేయబోయే సినిమాలో శివాజీని విలన్ గా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే శివాజీ బోయపాటిని కలిసి తనకు విలన్ గా చేయాలని ఉంది అని చెప్పాడంట, దాంతో బోయపాటి విలన్ గా తీసుకుంటాను గాని దానికి సంబంధించిన వర్క్ అవుట్ లను చేయమని చెప్పినట్టుగా తెలుస్తుంది.
ఇక ప్రస్తుతం శివాజీ అదే పనిలో ఉన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక శివాజీ గత కొన్ని సంవత్సరాల క్రితమే సినిమా ఇండస్ట్రీ ని వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లినప్పటికీ ప్రస్తుతం తన ఫ్యామిలీని పోషించడానికి మళ్లీ సినిమాలు చేయాల్సి వస్తుందంటూ కొన్ని సందర్భాల్లో తెలియజేశాడు. ఇక అందులో భాగంగానే బోయపాటి సినిమాలో విలన్ గా నటిస్తే ఇక మీదట తనకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా విపరీతమైన అవకాశాలు వస్తాయనే ఉద్దేశ్యం లోనే బోయపాటి డైరెక్షన్ లో విలన్ గా నటించడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ఇంతకు ముందే బోయపాటి శ్రీను కి , శివాజీ కి మధ్య మంచి ఫ్రెండ్షిప్ అయితే ఉంది. వాళ్ళిద్దరికీ ఉన్న మంచి బాండింగ్ తోనే తులసి సినిమాలో శివాజీని నయనతార అన్న క్యారెక్టర్ లో తీసుకున్నాడు. ఇక ఆ సినిమాలో నటించి మెప్పించిన శివాజీ ఆ తర్వాత మళ్లీ ఆయన సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. ఇక ఇప్పుడు ఏకంగా విలన్ పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా శివాజీ కెరీర్ కి ఎంత మేరకు ఉపయోగపడుతుందనేది తెలియాల్సి ఉంది…