https://oktelugu.com/

earn : అధిక వడ్డీ రావాలంటే ఇందులో ఇన్వెస్ట్ చేయండి..

ఇన్వెస్ట్ మెంట్ చేసి డబ్బులు సంపాదిలని చాలా మంది అనుకుంటారు. అందుకే స్టాక్ మార్కెట్(Stack Market), బ్యాంక్ సేవింగ్స్(Bank savings), ఫిక్స్డ్ డిపాజిట్(FD), రియల్ ఎస్టేట్(Real Estate) వంటి రూట్ లను ఎంచుకుంటారు ప్రజలు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : December 10, 2024 / 12:20 PM IST

    earn

    Follow us on

    earn : ఇన్వెస్ట్ మెంట్ చేసి డబ్బులు సంపాదిలని చాలా మంది అనుకుంటారు. అందుకే స్టాక్ మార్కెట్(Stack Market), బ్యాంక్ సేవింగ్స్(Bank savings), ఫిక్స్డ్ డిపాజిట్(FD), రియల్ ఎస్టేట్(Real Estate) వంటి రూట్ లను ఎంచుకుంటారు ప్రజలు. కొన్నింటిలో పెట్టుబడి పెడితే మాత్రం భద్రత పరమైన సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. కొన్ని ప్రభుత్వ పథకాల్లో(Government Schemes) పెట్టుబడి పెడితే ఎలాంటి సమస్య ఉండదు. అంతేకాదు ఏకంగా అధిక వడ్డీ రేటు కూడా వస్తుంది. దీర్ఘకాలంలో మంచి రాబడి(Revenue) వస్తుంది అంటున్నారు బ్యాంకింగ్ నిపుణులు. మరి ఇలాంటి స్కీములు ఏం ఉన్నాయి? ప్రభుత్వం ఎలాంటి స్కీములను అందిస్తుందో తెలుసుకుందాం.

    సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడం వల్ల మీకు మంచి రిటర్న్ వస్తుంది. అయితే దీనికి వడ్డీ ఏకంగా 8.2% వస్తుంది. ఇందులో ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారా? జస్ట్ మీరు రూ. 1000 నుంచి రూ. 30,00,00 వరకు కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఇక ఎన్ని సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి అనిపిస్తుందా? జస్ట్ ఈ పథకానికి టైం టెన్యూర్ ఫైవ్ ఇయర్స్ మాత్రమే.

    సుకన్య సమృద్ధి యోజన లో మీరు ఇన్వెస్ట్ చేసినా కూడా మంచి రిటర్న్ వస్తాయి. దీనికి కూడా వడ్డీ 8%- 8.2% లుగా వస్తుంది. ఇందులో ఇన్వెస్ట్ లిమిట్ గురించి చెప్పాలంటే జస్ట్ రూ. 250 నుంచి రూ. 1.5 లక్షల వరకు కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇందులో జస్ట్ టైం టెన్యూర్ కాస్త ఎక్కువే అని చెప్పాలి. అంటే అమ్మాయికి 21 ఏళ్లు వచ్చే వరకు మీరు ఇన్వెస్ట్ చేయాలి.

    మరో మంచి పథకం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ అంటున్నారు నిపుణులు. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మీరు పెట్టబడి పెట్టిన మొత్తానికి వడ్డీ: 7.7 శాతం వస్తుంది. ఇందులో ఇన్వెస్ట్ లిమిట్ రూ.1000- గరిష్ట పరిమితి మాత్రం లేదు. ఇక టైం టెన్యూర్: 5 ఏళ్లుగా ఉంటుంది. మీకు ఈ పథకం కూడా మంచి రిటర్న్ ను అందిస్తుంది.

    కిసాన్ వికాస్ పాత్ర లో కూడా మీరు పెట్టుబడి పెట్టవచ్చు. దీని వల్ల మీరు మంచి మొత్తాన్ని పొందుతారు. అయితే దీనికి మీకు వడ్డీ: 7.5% గా వస్తుంది. అయితే ఇందులో ఇన్వెస్ట్ లిమిట్: రూ.1000- గరిష్ట పరిమితి లేదు. టైం టెన్యూర్: 115 నెలలుగా ఉంటుంది.

    పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ద్వారా కూడా మీరు పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఇందులో మీకు వడ్డీ: 7.4% రిటర్న్ వస్తుంది. ఇక ఇన్వెస్ట్ లిమిట్ రూ. 1000 నుంచి రూ. 9 లక్షలు వరకు ఉంటుంది. టైం టెన్యూర్ 5 ఏళ్లుగా ఉంటుంది. ఇందులో కూడా ఎలాంటి ఇబ్బంది, టెన్షన్ లేకుండా మీరు పెట్టుబడి పెట్టవచ్చు.

    అయితే మీరు గనుకు పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి రిటర్న్ వస్తుంది. దీనికి మీకు వడ్డీ: 7.1% గా వస్తుంది. ఇందులో ఇన్వెస్ట్ లిమిట్: రూ. 500 నుంచి రూ. 1.5 లక్షల వరకు ఉంటుంది. టైం టెన్యూర్ కూడా ఎక్కువే. అంటే 15 ఏళ్లుగా ఉంది.