International Yoga Day 2025: ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జూన్ 21వ తేదీన జరుపుకుంటారు. డైలీ కొంత సమయం యోగా చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. రోజూ ఉదయం లేదా సాయంత్రం వేళలో యోగా చేయడం వల్ల యంగ్ లుక్‌లో ఉంటారు. ముఖ్యంగా శారీరక, మానసిక సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే ప్రాచీనం నుంచి కూడా యోగా చేస్తున్నారు. యోగా వల్ల ఎలాంటి సమస్యలు అయినా కూడా తీరిపోతాయని నిపుణులు అంటున్నారు. అయితే అంతర్జాతీయ యోగాను ప్రతీ ఏడాది ఒక థీమ్‌తో జరుపుకుంటారు. మరి ఈ ఏడాది అంతర్జాతీయ యోగా థీమ్ ఏంటి? యోగా దినోత్సవం ఎందుకు జూన్ 21వ తేదీన జరుపుకుంటారు? దీనికి కారణం ఏంటి? పూర్తి వివరాలు కూడా ఈ రోజు స్టోరీలో తెలుసుకుందాం.
ఈ ఏడాది థీమ్ ఏంటంటే?
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తేదీన జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది థీమ్ ‘యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్’ (Yoga for One Earth, One Health)తో నిర్వహిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ థీమ్‌తో యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఘనంగా ప్రపంచ దేశాలు స్పెషల్ డే యోగాను జరుపుకుంటాయి. అయితే దేశంలో పలు ప్రాంతాల్లో ఘనంగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. వీటికి దేశ ప్రధాని మోదీ కూడా హాజరు కానున్నారు. అయితే యోగా భారీ ప్రదర్శనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలోని విశాఖలో ప్రధాని మోదీ శనివారం ఉదయం యోగా కార్యక్రమాన్ని మొదలు పెట్టనున్నారు.
జూన్ 21నే ఎందుకు?
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన కృషి ఫలితంగా ఈ రోజున జరుపుకుంటున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2014లో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి 69వ జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించింది. యోగా ప్రాచీనం, ఆరోగ్యం, మానసిక సమస్యలు, దాని ఆరోగ్యం వంటి వాటి గురించి మోదీ ఈ కార్యక్రమంలో తెలిపారు. అయితే 2015లో న్యూఢిల్లీలో భారీ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పుడు మొట్టమొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులను సాధించింది. ఇలా అప్పటి నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
యోగా ప్రయోజనాలు
రోజూ ఉదయం, సాయంత్రం వేళలో యోగా చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శారీరకంగా, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. డైలీ యోగా చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు అయినా కూడా తీరిపోతాయి. ముసలితనం తొందరగా రాకుండా యంగ్ లుక్‌లో కనిపిస్తారు. అన్ని విధాలుగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. యోగా వల్ల క్యాన్సర్, గుండె పోటు, కిడ్నీ వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి డైలీ ఒక పది నిమిషాలు అయినా యోగా చేయడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.