Infosys Narayana Murthy: ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది.. ఇది నిజ జీవితంలో చాలాసార్లు నిరూపితమైంది.. అందుకే ఇది ఒక నానుడి అయింది. అమెజాన్ జెఫ్ బెజోస్, ఆపిల్ టిమ్ కుక్, గూగుల్ సుందర్ పిచాయ్, రిలయన్స్, గౌతమ్ అదానీ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది పేరు పొందిన వ్యాపారవేత్తల విజయాల వెనుక వారి సతీమణులు ఉన్నారు.. వారి వ్యాపారాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.

వారి వద్ద అప్పు తీసుకున్నారు
సాధారణంగా ఇళ్లల్లో గృహిణులు పోపు డబ్బాల్లోనో, బీరువా అరల్లోనో డబ్బు దాస్తారు ఇందుకు కారణం లేకపోలేదు.. ఏదైనా అత్యవసర సమయానికి డబ్బులు లేనప్పుడు అవి ఉపయోగపడుతుందని.. ఇప్పటికీ భారతదేశంలో మెజారిటీ మధ్యతరగతి మహిళలు చేసే పని కూడా అదే.. ఇక ఇప్పుడు వివిధ స్థాయిలో ఉన్న వ్యాపారవేత్తలు ఒకప్పుడు నష్టాలు చవి చూసినవారే. అలాంటి సమయంలో వారికి వాళ్ళ సతీమణులే అప్పు ఇచ్చారు. ఆ అప్పుతోనే వాళ్ల భర్తలు ఆగర్భ శ్రీమంతులయ్యారు. అప్పు తెచ్చిన చోటే అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగారు.. నౌకరి. కామ్ ను స్థాపించిన సంజీవ్ భిఖ్ చందానీ ఆయన వ్యాపారవేత్తగా స్థిరపడకముందు… తొలినాళ్లలో ప్రారంభించిన వ్యాపారం లో తీవ్ర నష్టాలు ఎదురయ్యాయి.. దీంతో ఆయన సతీమణి అతనికి అప్పు ఇచ్చింది.. ఆ అప్పుతోనే ఆయన నౌకరి.. కామ్ ను ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన ఎప్పుడు కూడా వెనుతిరిగి చూసుకోలేదు..” నేను నష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ నమ్మలేదు.

ఆ సమయంలో నా భార్య నాకు అప్పు ఇచ్చింది. ఆ అప్పు నా బాధ్యతను మరింత పెంచింది. నేను వెంటనే ఆ డబ్బుతో నౌకరి. కామ్ ను ప్రారంభించాను. అది ఇవాళ నన్ను భారత దేశంలో ఒక ప్రముఖమైన వ్యక్తిని చేసింది.. నా విజయం వెనుక ఎవరున్నారు అంటే అది నా భార్య ఇచ్చిన అప్పే” అని అంటాడు సంజీవ్. ఇక ప్లాట్ హెడ్స్ సహ వ్యవస్థాపకుడు గణేష్ బాలకృష్ణన్ … ఆ కంపెనీ స్థాపించక ముందు ఇంట్లో ఖాళీగా ఉండేవాడు. ఆయన భార్య సంపాదన మీద ఆధారపడి బతికేవాడు. ఆ సమయంలో చాలామంది అతడిని హేళనగా చూసేవారు.. కానీ అవేవీ అతడిని ఇబ్బంది పెట్టలేదు. ఒకరోజు తన భార్య తో చర్చలు జరుగుతున్నప్పుడు.. వ్యాపారం ప్రస్తావనకు వచ్చింది.. మీరు ఇంట్లో ఉండే బదులు దానిని ఎందుకు ప్రారంభించకూడదని అతని భార్య చెప్పింది.. తొలి పెట్టుబడి కూడా ఆమె ఇచ్చింది. ఆ తర్వాత గణేష్ బాలకృష్ణ న్ అంచెలు అంచలుగా తన వ్యాపారాన్ని వృద్ధి చేశాడు. ఇవాళ భారతదేశంలో ఓ ప్రముఖ వ్యాపారవేత్త అయ్యాడు.
సుధా మూర్తిది మరో స్టోరీ
భారతదేశంలోనే కాదు ప్రపంచంలో చాలామంది ఇన్ఫోసిస్ అంటే తెలియని వారు ఉండరు.. అంతలా నాటుకుపోయింది ఆ కంపెనీ.. ఆ కంపెనీ ఇవాళ ఈ స్థాయికి రావడం వెనుక చాలామంది కృషి ఉంది.. ముఖ్యంగా ఇన్ఫోసిస్ ను ప్రారంభించక ముందు నారాయణమూర్తి వ్యాపారం చేశారు.. అందులో నష్టాలు రావడంతో ఆయన భార్య సుధ పదివేల రూపాయలు అప్పుగా ఇచ్చింది.. ఆ అప్పుతో నారాయణమూర్తి ఇన్ఫోసిస్ ను కొంతమంది మిత్రుల సహకారంతో ప్రారంభించారు.. ఆ తర్వాత ఆయన వెను తిరిగి చూసుకోలేదు.. ఆ సంస్థను తన మానస పుత్రికగా అభివృద్ధి చేసుకున్నారు. ఇవాళ వేల కోట్ల కంపెనీగా అభివృద్ధి చేశారు..” ఆరోజు నన్ను సుధ నమ్మింది.. పదివేల రూపాయలు అప్పుగా ఇచ్చింది.. ఆ అప్పుతోనే నేను ఇన్ఫోసిస్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాను.. తర్వాత ఆ సంస్థ మహావృక్షమైంది. సుధ కనుక అప్పు ఇవ్వకపోతే ఇన్ఫోసిస్ ఉండేది కాదు” అని మూర్తి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.. వీరే కాదు చాలామంది వ్యాపారుల జీవితాల్లో వాళ్ల భార్యలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.. అందుకే వాళ్ళ వ్యాపార సంస్థలు అంచలంచెలుగా ఎదుగుతున్నాయి.