RRR And kantara -The Kashmir Files: ఇండియా ఎన్నడూ లేని విధంగా ఆస్కార్ బరిలో నిలిచింది.మన దేశానికి చెందిన చాలా చిత్రాలు షార్ట్ లిస్ట్ అయ్యాయి. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్, రిషబ్ శెట్టి కాంతార చిత్రంతో పాటు వివాదాస్పద చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్ ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో చోటు సంపాదించాయి. 95 వ ఆస్కార్ అవార్డ్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా 301 చిత్రాలు పోటీపడుతున్నాయి. షార్ట్ లిస్ట్ అయ్యాయి. జనవరి 12 నుంచి 17వ వరకు షార్ట్ లిస్ట్ అయిన చిత్రాలు ఓటింగ్లో పాల్గొననున్నాయి.

విభాగాల వారీగా అత్యధిక ఓట్లు పొందిన చిత్రాలు నామినేషన్స్ లో చోటు దక్కించుకుంటాయి. ప్రతి విభాగం నుండి ఐదు చిత్రాలు నామినేషన్స్ దక్కించుకుంటాయి. వాటిలో ఒకటి ఫైనల్ గా విన్నర్ అవుతుంది. ప్రఖ్యాత సినిమా అవార్డు గెలుచుకునే అరుదైన అవకాశం దక్కుతుంది. ఆస్కార్ అవార్డు గెలవడం ప్రతి ఒక్కరి కలగా ఉంటుంది. దాన్ని ముద్దాడాలని, తాకాలని నటులు, సాంకేతిక నిపుణులు కోరుకుంటారు. అయితే అదంత ఈజీ కాదు.
ఇక ఈ ఏడాదికి గాను రాజమౌళి విజువల్ వండర్ ఆర్ ఆర్ ఆర్, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన పీరియాడిక్ డ్రామా గంగూబాయి కతియావాడి, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన ది కాశ్మీర్ ఫైల్స్, అలాగే సంచలన విజయం నమోదు చేసిన రిషబ్ శెట్టి డైరెక్టోరియల్ కాంతార ఆస్కార్ నామినేషన్స్ లో షార్ట్ లిస్ట్ అయ్యాయి.
అలాగే మరాఠీ చిత్రాలైన ‘మే వసంతరావు’, ‘తుజ్యా సతీ కహీ హై’, ఆర్ మాధవన్ నటించిన బయోపిక్ రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ షార్ట్ లిస్ట్ లో చోటు సంపాదించాయి. ఇక ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు అధికారిక ఆస్కార్ ఎంట్రీ ఛెలో షో కూడా జాబితాలో ఉంది. అలాగే ఇరవిన్ నిజల్ , కన్నడ చిత్రం విక్రాంత్ రోనా. శౌనక్ సేన్ తెరకెక్కించిన డాక్యుమెంటరీ ఆల్ దట్ బ్రీత్స్, కార్తీకి గోన్సాల్వ్స్ ‘ది ఎలిఫెంట్ విస్పర్స్’ షార్ట్ లిస్ట్ అయ్యాయి.

వీటన్నింటిలో ఆర్ ఆర్ ఆర్ మూవీ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్స్ లో చోటు సంపాదిస్తుందని ఇండియన్ చిత్ర వర్గాలు నమ్ముతున్నాయి. నేడు అదే విభాగంలో ఆర్ ఆర్ ఆర్ మూవీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుంది. ఈ క్రమంలో ఆస్కార్ ఆశలు మరింత బలపడ్డాయి. ప్రతిసారి ఆస్కార్ అవార్డ్స్ విషయంలో ఇండియాకు నిరాశే ఎదురవుతోంది. ఈసారైనా ఆస్కార్ ఇండియాకు వస్తుందేమో చూడాలి.