సాధారణంగా కొన్ని దేశాలలో కొన్ని మతాలు కులాల వారు వివిధ రకాల సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తుంటారు. ప్రపంచం ఎంత ముందుకు వెళ్తున్న మీరు మాత్రం ఆ సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్ని వింత ఆచార వ్యవహారాలను పాటిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండోనేషియాలోని సుంబా దీవిలో ఇప్పటికీ ఒక వింత ఆచారం ఉంది.ఇక్కడ ఏ అబ్బాయి కైనా ఒక అమ్మాయి నచ్చితే తనను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవచ్చు. ఈ విధమైనటువంటి వింత ఆచారాన్ని ఇక్కడ కవిన్ టాంగాప్ అనే పేరుతో పిలుస్తారు.
ఇక్కడ వారి ఆచార వ్యవహారాలు ఎంతో భిన్నంగా ఉంటాయి. ఇక్కడ వాళ్ళు ప్రతి వస్తువుకి ప్రాణం ఉందని నమ్ముతారు. పొరపాటున ఈ ప్రాంతంలో నివసించే అమ్మాయిల నుదుటిపై నీళ్లు తాకితే వారు అక్కడి నుంచి బయటకు వెళ్లకూడదన్న ఆచారాన్ని పాటిస్తారు. అదేవిధంగా ఒక అబ్బాయికి ఎవరైనా అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయినీ కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటారు. ఈక్రమంలోనే నచ్చిన అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి వారి ఇంటిలో తన నుదిటిపై నీరు తాకెలా చేస్తారు. ఇలా నీళ్లు తాకడం వల్ల ఆ అమ్మాయి అక్కడి నుంచి బయటకు వెళ్ళదు.
ఇవి కూడా చదవండి: Flight Safety Rules: మీరు విమానంలో ప్రయాణిస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే!
ఈ క్రమంలో ని తనను కిడ్నాప్ చేసిన అబ్బాయి తనని వివాహం చేసుకుంటాడు. వివాహమైన తర్వాత అమ్మాయికి ఇష్టం లేకపోయినా అక్కడే ఉండాల్సి ఉంటుంది. అలా కాదని అమ్మాయి బయటకు వెళ్తే తన పెళ్ళికి పిల్లలను కనడానికి పనికిరాదని తనపై ముద్ర వేస్తారు. కనుక అమ్మాయికి ఇష్టం లేకపోయినా అతడితో కలిసి జీవించడానికి సిద్ధపడుతుంది.ప్రపంచం ఎంతో ముందుకు వెళ్తున్న ఇలాంటి రోజులలో కూడా ఈ విధమైనటువంటి వింత ఆచారాలు పాటిస్తూ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాలు కొన్ని చట్టపరమైన చర్యలు తీసుకొని వారిలో అవగాహన తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
ఇవి కూడా చదవండి: Tollywood Heros Real Names ఈ హీరోల పేర్లు ఇవి కావు.. అసలు పేర్లు ఇవిగో..