Homeఎంటర్టైన్మెంట్Pushpa: అన్ని భాషల్లో 'పుష్ప; శాటిలైట్​ రైట్స్​ కొనుగోలు.. ఎంతో తెలుస్తే షాక్​!

Pushpa: అన్ని భాషల్లో ‘పుష్ప; శాటిలైట్​ రైట్స్​ కొనుగోలు.. ఎంతో తెలుస్తే షాక్​!

Pushpa: ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్​ హీరోగా దర్శకుడు సుకుమార్​ తెరకెక్కిస్తోన్న సినిమా పుష్ప. ఇందులో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్​గా కనిపించనున్నారు. రష్మిక తొలిసారి బన్నీతో కలిసి స్క్రీన్ షేర్​ చేసుకోనుంది. కాగా, ఈ సినిమా విడుదలకు ఇంకా నెల మాత్రమే మిలిగింది. డిసెంబరు 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్​లు, పాటలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో పలు యాక్షన్ సీక్వెన్స్​లు హైలైట్​గా నిలవనున్నట్లు తెలుస్తోంది. కాగా, పుష్ప సినిమా విడుదలకు దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్​లో జోరు పెంచింది. ఈ క్రమంలోనే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

pushpa

ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్​ తమిళనాడు థియేట్రికల్​ హక్కులను భారీ ధరతో సొంతం చేసుకున్నట్లు సమాచారం. సుమారు 6.5 కోట్లకు పుష్ప రైట్స్​ను కొనుగోలు చేసిందని సినీ వర్గాల్లో టాక్​. కాగా, మలయాళ రైట్స్​ను ఏషియా నైట్​ మంచి ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల కానున్న అన్ని భాషల్లో శాటిలైట్​ రైట్స్​ కొనుగోలు ముగిసిందట. మరోవైపు హిందీ వర్షన్​లో రిలీజ్​కు ఎదురైన సమస్య కూడా తీరీపోయింది. పుష్ప సినిమాను బాలీవుడ్​ డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్లలో విడుదల చేసేందుకు అంగీకరించారు. దీంతో డిసంబరు 17న థియేటర్లలో సందడి చేసేందుకు పుష్ప రెడీగా ఉన్నాడు.

ఈ సినిమా కోసం బన్నీ తనను తాను పూర్తిగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రష్మిక కూడా డీ గ్లామర్​ పాత్రలో కనిపించనుంది. ఈ క్రమంలోనే ఆమెకు మేకప్​ విషయంలో సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular