Jobs: ఇండియన్ నేవీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఆగస్టు 2022 బ్యాచ్ లో సెయిలర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అవివాహిత పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. మొత్తం 2500 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలలో ఎస్‌ఎస్‌ఆర్(సీనియర్ సెకండరీ రిక్రూట్స్) 2000, ఏఏ(ఆర్టిఫీషర్ అప్రెంటిస్) 500 ఉన్నాయి.
నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఇంటర్ లో కనీసం 60 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. 2002 సంవత్సరం ఆగష్టు నెల 1వ తేదీ నుంచి 2005 సంవత్సరం జులై 31వ తేదీ మధ్య జన్మించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు.
ఆన్ లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్(పీఎఫ్‌టీ), మెడికల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు శిక్షణ సమయంలో నెలకు 14,600 రూపాయలు వేతనంగా లభిస్తుంది. శిక్షణ పూర్తైన తర్వాత నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు వేతనం లభిస్తుంది.
మార్చి నెల 29వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా 2022 సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. https://www.joinindiannavy.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.