Jobs: హైదరాబాద్‌లోని ఆర్టిలెరీ సెంటర్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. గ్రూప్ సీ, డీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. మొత్తం 8 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. ఈ ఉద్యోగ ఖాళీలలో పోస్టుల ఆధారంగా వేతనంలో మార్పులు ఉంటాయి.
మెట్రిక్యులేషన్, తత్సమాన అర్హత ఉన్నవాళ్లు డ్రాప్ట్స్ మ్యాన్ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ.25,500ల నుంచి రూ.81,100 వరకు వేతనంగా లభించే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎంటీఎస్ పోస్టులకు కూడా ఇవే విద్యార్హతలు ఉండగా నెలకు 18,000 రూపాయల నుంచి 56,900 రూపాయల వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది.
బూట్ మేకర్ పోస్టులకు కూడా ఇవే విద్యార్హతలు ఉండగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ.19,900ల నుంచి రూ.63,200 వరకు వేతనంగా లభిస్తుంది. ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉన్నవాళ్లు ఎండీసీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు రూ.19,900ల నుంచి రూ.63,200 వేతనం లభించనుంది. రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది.
ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంస్థ హైదరాబాద్ అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి. 2022 సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది. https://joinindianarmy.nic.in/authentication.aspx వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
[…] Telangana Intermediate Board: ఇంటర్ పరీక్షలకు ఇంకా నెల రోజులకుపైగా సమయం ఉంది. కరోనా కారణంగా రెండు బ్యాచ్‌లను పరీక్ష లేకుండానే పాస్ చేసిన తెలంగాణ ప్రభుత్వం కరోనా సెకండ్ వేవ్ తర్వాత గత సెప్టెంబర్‌లో ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించింది. కరోనా కాలంలో ఆన్‌లైన్ తరగతులు కొనసాగించిన ఇంటర్ బోర్డు.. సిలబస్ తగ్గించి ఎక్కువ చాయిస్ ప్రశ్నలతో పరీక్షలు నిర్వహించింది. ఇందులో కేవలం 40 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. 60 శాతం మంది ఫెయిల్ అయ్యారు. దీంతో పరీక్షల నిర్వహణ.. ఆన్‌లైన్ తరగతులతో పాఠాలు అర్థం కాక చాలామంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని తల్లిదండ్రులు ఆందోళన చేశారు. కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వ వైఖరితోనే విద్యార్థులకు నష్టం జరిగిందని రాజకీయం చేశాయి. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం మొదటి సంవత్సరం పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ మార్కులతో పాచేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా తెలిపారు. ఇలా పాస్ చేయడం ఇదే చివరిసారని, ఇకపై పాస్ చేయడం ఉండదని స్పష్టం చేశారు. […]