Homeఆంధ్రప్రదేశ్‌Comedian Prithviraj Interesting Comments: కమెడియన్ పృథ్వీకి ఇప్పుడు బుద్దొచ్చిందట?

Comedian Prithviraj Interesting Comments: కమెడియన్ పృథ్వీకి ఇప్పుడు బుద్దొచ్చిందట?

Comedian Prithviraj Interesting Comments: దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. సత్తా ఉన్నప్పుడే సంపాదించుకోవాలి. అంతేకాని నేను తోపునని విర్రవీగుతూ రాజకీయాలు చేస్తే అంతే సంగతి. ఉన్న పని కూడా ఉండదు. అవకాశాలు లేక ఆగం కావడం ఖాయం. సరిగ్గా ఈ మాటలు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి సరిపోతాయి. ఆర్టిస్టుగా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో రాజకీయాల్లో చేరి నానా రభస సృష్టించాడు. దీంతో అవకాశాలు సన్నగిల్లాయి. మళ్లీ పశ్చాత్తాప పడుతూ తనకు అవకాశాలు ఇవ్వాలని వేడుకుంటున్నాడు. అలుసు తొక్కనేల కాలు కడగనేలా అన్నట్లు మొదట బింకం ఎందుకు తరువాత బాధలెందుకు అనే వాదన వస్తోంది.

Comedian Prithviraj Interesting Comments
Comedian Prithviraj Interesting Comments:

కట్ చేస్తే పృథ్వీ మంచి కమెడియన్. రోజుకు రూ. 5 లక్షలు తీసుకునే స్థాయికి చేరాడు. కానీ అంతటితో ఆగలేదు. 2019 ఎన్నికల్లో వైసీపీ జెండా పట్టుకుని ప్రచారం చేశాడు. అందరిని తిట్టేశాడు. చివరకు మెగా కుటుంబాన్ని సైతం నానా మాటలు అన్నాడు. దీంతో అతడి భవిష్యత్ కు బీటలు వారింది. అవకాశాలు రావడం మానేశాయి. దీంతో ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నానంటూ అందరని వేడుకుంటున్నాడు. అప్పుడే బుద్ధిగా ఉంటే ఈ బాధ తప్పేది కదా అని పలువురు చెబుతున్నారు.

Also Read: Aishwarya Rajinikanth: ప్చ్.. అన్ని చోట్ల తీసిపారేసిన ఐశ్వర్య రజనీకాంత్‌ !

వైసీపీ పెద్దల ప్రాపకం కోసం తెగ ప్రయత్నం చేశాడు. కానీ వారంతా అవకాశవాదులనే సంగతి తెలియదు. ఏరు దాటేదాక ఓడ మల్లయ్య ఏరు దాటాక బోడ మల్లయ్య అన్నట్లుగా మొదట ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. కానీ అక్కడ కూడా రాజకీయాలు చేసి పదవి పోగొట్టుకున్నాడు. దీంతో రెంటికి చెడ్డ రేవడిలా మారింది పరిస్థితి. ప్రస్తుతం మాత్రం తనకు అవకాశాలు లేక అందరిని బతిమిలాడుకుంటున్నాడు. ఒక్క చాన్స్ ఇవ్వాలని వేడుకుంటున్నాడు.

Comedian Prithviraj Interesting Comments
Comedian Prithviraj Interesting Comments

అటు బతుకు బండి నడవక ఇటు రాజకీయాలు సాగక పృథ్వీ ఇబ్బందుల్లో పడిపోయాడు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ మెల్లగా ఎదిగిన కమెడియన్ కథలకు పోయి భవిష్యత్ ను చేజార్చుకున్నాడు. ఇప్పుడు వేషాలు రాకపోవడంతో పూట గడవడమే కష్టంగా మారిందనే విషయం తెలుస్తోంది. ఏదిఏమైనా ఏదైనా స్థాయి వచ్చాక పొంగిపోకూడదు. దాన్ని నిలబెట్టుకోవాలి. అందుకోసం కష్టపడాలి. కానీ రాజకీయాలు చేసి తన ఎదుగుదలను తానే నాశనం చేసుకున్న దురదృష్టవంతుడు పృథ్వీ.

Also Read: AP New Ministers: ఏపీ మంత్రివర్గ విస్తరణ డేట్ ఫిక్స్.. కొత్త మంత్రులెవరు?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

1 COMMENT

  1. […] Allu Arjun- Kalyan Ram: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు గత కొన్నిరోజులుగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కార్లకు బ్లాక్ ఫిల్మ్‌లు, టూ వీలర్స్‌కు ప్రెస్, పోలీస్ అంటూ నకిలీ స్టిక్కర్లు అతికిస్తుండటంతో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు మరింత జోరు పెంచారు. బ్లాక్ ఫిల్మ్‌లు కనిపించిన కార్లను అడ్డుకుని జరిమానాలు విధిస్తున్నారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular