
India vs Australia: నాగపూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత్ 400 పరుగులకు ఆల్ అవుట్ అయింది. 7 వికెట్ల నష్టానికి 321 పరుగులతో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్.. ఏడు పరుగులు జోడించి రవీంద్ర జడేజా వికెట్ కోల్పోయింది.. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన షమీ మెరుపులు మెరిపించాడు..క్రీజు లో ఉన్నంతసేపు ఆస్ట్రేలియా బౌలర్ల ను ఒక ఆట ఆడుకున్నాడు.. ఫోర్లు, సిక్స్ లతో హోరెత్తించాడు. 47 బంతుల్లో మూడు సిక్స్ లు, రెండు ఫోర్ల సహాయంతో 37 పరుగులు చేసి అవుట్ అయ్యాడు..
సెంచరీ మిస్
ఇక జడేజాకు మంచి సపోర్ట్ ఇచ్చిన అక్షర్ పటేల్… మూడో రోజు కూడా అదే జోరు కొనసాగించాడు.. సెంచరీకి చేరువలో ఉండగా 84 పరుగుల వద్ద కమ్మిన్స్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ 400 పరుగులకు ఆల్ అవుట్ అయింది.. కమిన్స్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసి ఫ్రంట్ ఫుట్ కు వచ్చిన అక్షర్ పటేల్..బౌల్డ్ అయ్యాడు.. లేకుంటే అతడి సెంచరీ పూర్తయ్యేది.

ఇక తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాకు కొత్త గొప్ప ఆనందం కలిగించే విషయం ఏదైనా ఉందంటే అది ముర్ఫె మాత్రమే.. ఎందుకంటే తన ఆరంగేట్రం మ్యాచ్లోనే అతడు ఏకంగా ఏడు వికెట్లు తీశాడు.. శనివారం మూడో రోజు ఆటలో కూడా కీలకమైన రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ వికెట్లు అతడే తీశాడు. ఒకవేళ కనుక అతడు లేకపోయి ఉంటే భారత్ సులభంగా 500 కు మించి పరుగులు సాధించేది. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ 400 పరుగులకు ఆల్ అవుట్ కావడంతో ఇండియా జట్టుకు 223 పరుగుల ఆధిక్యం లభించింది. నిర్జీవంగా మారిన ఈ పిచ్ ను భారత స్పిన్నర్లు ఎంత మేరకు సద్వినియోగం చేసుకుంటారనే దానిపైనే టీం ఇండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి..
