
India Vs Australia: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ లో జరుగుతున్న మూడో టెస్టులో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. శుక్రవారం ఉదయం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఓపెనర్లలో ఉస్మాన్ ఖవాజా పరుగులేమీ చేయకుండానే వెనుతిరిగాడు. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో బంతిని డిఫెన్స్ ఆడబోగా… అది ఎడ్జ్ తీసుకొని నేరుగా కీపర్ శ్రీకర్ భరత్ చేతిలోకి వెళ్ళింది. దీంతో 0 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తన తొలి వికెట్ కోల్పోయింది.
నిర్ణయం మారింది
తన కెప్టెన్సీ పట్ల వస్తున్న విమర్శలు నేపథ్యంలో రోహిత్ శర్మ తన మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. నిన్న ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో రవిచంద్రన్ అశ్విన్ కు చాలాసేపటి దాకా బౌలింగ్ ఇవ్వని రోహిత్ శర్మ.. శుక్రవారం మొదలైన రెండో ఇన్నింగ్స్ లో మాత్రం అశ్విన్ తోనే బౌలింగ్ ప్రారంభించాడు. మైదానంపై తేమ ఉన్నప్పటికీ బంతి గింగిరాలు తిరుగుతున్న నేపథ్యంలో అశ్విన్ దానిని సద్వినియోగం చేసుకున్నాడు. కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తనదైన శైలిలో బంతిని తిప్పాడు. దానికి వికెట్ రూపంలో ఫలితం వచ్చింది. ఫలితంగా భారత్ శిబిరంలో ఉత్సాహం వెల్లి విరిసింది. ఇక ప్రస్తుతం క్రీ జు లో హెడ్, లాబు షాంగే ఉన్నారు.. ఏ స్పిన్ బౌలింగ్ తో అయితే తమను ఆస్ట్రేలియా బోల్తా కొట్టిందో, అదే అస్త్రాన్ని కంగారుల మీద భారత్ ప్రయోగిస్తోంది. ఫాస్ట్ బౌలర్లను కాదని ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాతో బౌలింగ్ ప్రారంభించాడు. ఇందులో భాగంగానే రవిచంద్రన్ ఉస్మాన్ ఖవాజా వికెట్ తీశాడు.

పాపం ఖవాజా
ఉస్మాన్ ఖవాజాకు మంచి రికార్డు ఉంది. ఇతడు మినిమం గ్యారంటీ బ్యాట్స్మెన్ గా పేరుపొందాడు. కానీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అంతగా రాణించలేకపోతున్నాడు. కానీ మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 60 పరుగులు చేశాడు.. దీనివల్ల ఆస్ట్రేలియా భారత్ పై ఆధిపత్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో ఇతడు చేసిన 60 పరుగులు ఆస్ట్రేలియా తరఫున టాప్ స్కోర్ కావడం గమనార్హం. అదే జోరును ఖవాజా రెండో ఇన్నింగ్స్ లో ప్రదర్శించలేకపోయాడు.. అశ్విన్ బౌలింగ్లో డక్ అవుట్ గా వెనుతిరిగాడు..” తొలి ఇన్నింగ్స్ లో 60 పరుగులు చేశావు. రెండో ఇన్నింగ్స్ లో సున్నా కే అవుట్ అయ్యావు. ఇదేంటి ఖవాజా” అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
Trust @ashwinravi99 to do the job! A wicket on 2nd ball of Day 3!⚡️#INDvAUS pic.twitter.com/OO4hGDXwjn
— BCCI (@BCCI) March 3, 2023