
IND vs AUS : మన స్పిన్ మనల్నే కాటేసింది. టీమిండియా దేన్నైతే బలం అని విర్రవీగిందో అదే స్పిన్ తో మనల్ని ఆస్ట్రేలియా చావుదెబ్బ తీసింది. తొలి రెండు టెస్టుల్లో మన స్పిన్ ఉచ్చులో ఆస్ట్రేలియన్లను ముప్పుతిప్పలు పెట్టిన టీమిండియా బౌలర్లు నాలుగో టెస్టులో మాత్రం తేలిపోయారు. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ పై మునుపటంత ప్రభావం చూపించలేదు.
ఇక స్పిన్ ఆడడంలో తడబాటును అధిగమించిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ఈసారి సమర్థంగా ఎదుర్కొని కాసిన్ని పరుగులు చేశారు. అదే సమయంలో మన టీమిండియా బ్యాట్స్ మెన్ అదే స్పిన్ ఆడడంలో విఫలమై తొలి ఇన్నింగ్స్ లో కేవలం 109కే ఆలౌట్ అయ్యారు. ఇక ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 197 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లోనూ టీమిండియా 163 పరుగులకే కుప్పకూలడంతో భారత్ ఓటమి ముగిట నిలిచింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. భారత్ నిర్ధేశించిన 76 పరుగుల టార్గెట్ ను కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. తొలి ఓవర్ లోనే ఖవాజా డకౌట్ కాగా.. ట్రావిస్ హెడ్ 49, లబుషేన్ 28 పరుగులతో దంచి కొట్టడంతో ఆస్ట్రేలియా గెలిచేసింది.
ఈ ఓవరాల్ టెస్టులో ఏ స్పిన్ తో అయితే ఆస్ట్రేలియాను మనం బెంబేలెత్తించామో అదే స్పిన్ తో మనల్ని ఆస్ట్రేలియా ఆలౌట్ చేసింది. మన బ్యాట్స్ మెన్ స్పిన్ ఆడడంలో విఫలం కావడం టీమిండియాకు శాపంగా మారింది. మనోళ్ల ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే ఈ ఓటమి ఎదురైందని చెప్పొచ్చు.
ఈ ఓటమితో మన టీమిండియా ఫైనల్స్ చేరడం సమీకరణాలు మారిపోతున్నాయి. 4వ టెస్టులో గెలిస్తే అవకాశాలు ఉంటాయి. ఆ టెస్టులో ఓడిపోతే టీమిండియాకు టెస్ట్ చాంపియన్ షిప్ చేరడం కొంచెం క్లిష్టంగా మారనుంది.