Income Tax: ఆదాయానికి మంచి ఆస్తులు ఉండడం వల్ల Income Tax రైడ్ చేస్తుంది. ఐటీ రిటర్న్స్ ప్రకారం ఆదాయం, ఖర్చులు సమతుల్యంగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ లెక్కలోని రాని డబ్బు ఉండడం వల్ల వాటిని ఐటీ డిపార్ట్మెంట్ ఫైన్ వేస్తుంది. అంతకాకుండా ఎంత మొత్తంలో ఎక్కువ డబ్బు ఉందో.. దానిని సీజ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో చాలా మంది పరిమితికి మించి డబ్బు ఉన్న వారు వివిధ మార్గాల్లో సేవ్ చేస్తుంటారు. మరికొందరు టాక్స్ ఫ్రీ కార్యక్రమాలు చేస్తుంటారు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఖర్చుల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే సమస్య.. కానీ ఈ విషయంలో మాత్రం ఎంత ఎక్కువ డబ్బు ఉన్నా.. ఇన్ కం టాక్స్ రైడ్ చేయడానికి ఆస్కారం లేదు. ఎందుకో తెలుసా?
డబ్బు అందరికీ ఒకేలా ఉండదు. కొందరికీ ఎక్కువగా ఉండొచ్చు.. మరికొందరికి తక్కువగా ఉండొచ్చు. అయితే మూడో రకం వారు పరిమితికి మించి ఆదాయాన్ని కలిగి ఉంటారు. వీరు అక్రమంగా.. లేదా వివిధ కారణాలతో అధిక డబ్బును కలిగి ఉంటారు. ఇలాంటి వారిపై ఇన్ కం ట్యాక్స్ అధికారులు రైడ్ చేసి పరిమితికి మించి ఉన్న డబ్బును సీజ్ చేస్తారు. ఈ నేపథ్యంలో కొందరు అధికంగా ఉన్న డబ్బును అకౌంట్ లో చూపించకుండా జాగ్రత్త పడుతారు. అయితే ఓ సందర్భంగా పరిమితికి మించి ఆదాయం ఉన్నా.. ఈ సమయంలో ఐటీ అధికారులు రైడ్స్ చేసినా డబ్బు సీజ్ చేయడానికి ఆస్కారం లేదు. అలాగే జరిమానా కూడా కట్టాల్సిన పని లేదు. ఏ సమయంలో అంటే?
భారతదేశంలో వివాహా వేడుకలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. కనీసం వారం రోజుల పాటు ఈ వేడుకను బంధుమిత్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరుపుకుంటారు. అయితే ఇక్కడున్న సాంప్రదాయం ప్రకారం పెళ్లికి వచ్చిన వారు నగదు రూపంలో లేదా వస్తువులు రూపంలో బహుమతులు ఇస్తుంటారు. ఆ సమయంలో బహుమతులు అందుకున్న వ్యక్తికి ఆదాయం పెరుగుతుంది. అయితే ఇవి పరిమితికి మించి ఉన్నా వీటి విషయంలో ఇన్ కం ట్యాక్స్ రైడ్ చేయడానికి ఆస్కారం లేదు.
సాధారణంగా Income Tax Act ప్రకారం సెక్షన్ 69 బీ ప్రకారం పరిమితికి మించి ఆదాయం ఉన్నట్లు తేలితే 78 శాతం ట్యాక్స్ కట్టాలి.అలాగే 10 శాతం ఫెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. కానీ వివాహం జరిగిన తరువాత ఒక వ్యక్తిక ఏదో రూపంలో బహుతులు వస్తాయి. ఇవి నగదు రూపంలో కూడా ఉండొచ్చు. ఇలాంటి సమయంలో రైడ్ చేయడం వల్ల పరిమితికి మించి ఆదాయాన్ని కలిగి ఉంటారు. కానీ ఈ సమయంలో ఇన్ కం ట్యాక్స్ రైడ్ చేసినా Section 56 ప్రకారం వివాహం అయిన మూడు నెలల వరకు ఆ వ్యక్తి ఎటువంటి ఎక్కువ ఆదాయం కలిగినా ట్యాక్స్ తో పాటు ఫెనాల్టీ కట్టాల్సిన అవసరం లేదు. వీటిపై ఎలాంటి పరిమితి లేకుడా ట్యాక్స్ ఫ్రీని పొందొచ్చు.