Maharashtra Election results 2024 : దేశంలో రెండు నెలలుగా ఆసక్తి చేపుతున్న మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 20 ముగిసింది. దీంతో నవంబర్ 23న ఈసీ కౌంటింగ్ చేపట్టింది. శనివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలైంది. దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఫలితాలో 11 గంటల వరకు రానున్నాయి. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు 13 రాష్ట్రాల్లోని 46 అసెంబ్లీ, కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ కూడా జరుగుతోంది.
మహారాష్ట్రలో మహాయుతి జోరు..
మహారాష్ట్ర ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి దూసుకుపోతోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటుకు 145 స్థానాలు అవసరం. ప్రస్తుతం మూడు రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. 11 గంటల వరకు ఫలితాలపై స్పష్టత రానుంది. ఇప్పటి వరకు వస్తున్న ట్రెండ్స్ ప్రకారం మహాయుతి మ్యాజిగ్ ఫిగర్ 145ను దాటేసింది. ప్రస్తుతం 171 సీట్లలో మహాయుతి, 88 స్థానాల్లో మహా వికాస్ అఘాడీ కూటమి ఆధిక్యంలో ఉన్నాయి. ఒక స్థానంలో ఎంఐఎం ఆధిక్యత కనబరుస్తోంది.
బీజేపీ హవా..
ఇక మహారాష్ట్రలో బీజేపీ జోరు కొనసాగుతోంది. ఇక్కడ బీజేపీ నేతృత్వంలో శివసేన(షిండే), ఎన్‌సీపీ(అజితపవార్) పార్టీలు ఉన్నాయి. కూటమిలో బీజేపీ మెజారిటీ సీట్లలో పోటీ చేసింది. అంచనాల మేరకే.. బీజేపీ లార్జెస్టు సీట్లు సాధించే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ 106 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. శివసేన 45, ఎన్‌సీపీ 26 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. దీంతో వంద స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నాయకులు ధీమాతో ఉన్నారు.